అవినీతి నిర్మూలనకే విజిలెన్స్ విభాగం
మందమర్రిరూరల్: సింగరేణిలో అవినీతి నిర్మూలన కోసమే విజిలెన్స్ విభాగం ఏర్పాటు చేయడం జరిగిందని ఏరియా జీఎం రాధాకృష్ణ అన్నారు. విజిలెన్స్ వారోత్సవాల్లో భాగంగా గురువారం ఏరియాలోని జీవీటీసీలో విజిలెన్స్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా గెస్ట్ లెక్చరల్ కిషోర్ బుగాడియాతో కలసి అధికారులు, ఉద్యోగులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏరియా జీఎం భాస్కర్‌రెడ్డి, శ్రీరాంపూర్ ఏజీఎం రాజేందర్, జీవీటీసీ మేనేజర్ శంకర్, బెల్లంపల్లి, శ్రీరాంపూర్, మందమర్రి ఏరియా అధికారులు, పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.


