హాస్టల్ విద్యార్థి తలకు గాయం
లక్సెట్టిపేట: మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహంలో బుధవారం రాత్రి ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన తోపులాటలో పదోతరగతి చదువుతున్న కార్తీక్ అనే విద్యార్థి అదుపుతప్పి కిందపడ్డాడు. ఇనుప డోర్‌కు తాకడంతో తలకు గాయమైంది. హాస్టల్ వార్డెన్ కెజియారాణి వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. దీనిపై వార్డెన్‌ను వివరణ కోరగా మంచిర్యాలలోని ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించామని, ప్రమాదంలేదని వైద్యులు చెప్పడంతో గురువారం తల్లిదండ్రులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.


