రజక వృత్తిదారుల రక్షణ చట్టం ఏర్పాటు చేయాలి
పాతమంచిర్యాల: రజక వృత్తిదారుల రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏదునూరి మదర్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని చార్వాక భవన్‌లో రజక వృత్తిదారుల 25వ వార్షికోత్సవ సభ నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 10 లక్షల మంది రజక వృత్తిపై ఆధారపడి జీవ నం సాగిస్తున్నారని, ఆర్థికంగా, సామాజికంగా వె నుకబడి ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం రజకుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశా రు. పెత్తందారులు కులవివక్ష దాడులకు పాల్పడుతున్నారని, వాటిని అరికట్టడానికి ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర కార్యదర్శి పైళ్ల ఆశయ్య మాట్లాడుతూ రజకులకు ఉచిత విద్యుత్ పథకం కోసం నిధులు కేటాయించా లని, విద్యుత్ అధికారుల వేధింపులు ఆపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర సహయ కార్యదర్శి అన్నారపు వెంకటేశ్వ ర్లు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి క నికరపు అశోక్, పట్టణ పౌర వేదిక కన్వీనర్ గోమాస ప్రకాష్, జిల్లా కార్యవర్గ సభ్యులు నడిగోడి తిరుప తి, తోట కళావతి, సందీప్, సదయ్య పాల్గొన్నారు.


