‘గడ్డెన్నవాగు’కు భారీగా వరద
దిగువకు వెళ్తున్న నీళ్లు
ఎగువన మహారాష్ట్రతో పాటు పరీవాహక ప్రాంతాల్లో బుధవారం కురిసిన వర్షానికి గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి 14వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరడంతో అధికారులు రెండు గేట్లు 2 మీటర్ల మేర ఎత్తి 14,280 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 358.70 మీటర్లు కొనసాగిస్తూ నీటిని వదిలేస్తున్నారు. సాయంత్రానికి ఇన్‌ఫ్లో 9వేల క్యూసెక్కులకు తగ్గడంతో గేట్లను 1.2 మీటర్ల మేర ఎత్తి నీటిని
వదులుతున్నారు. – భైంసాటౌన్


