నయా.. వంచకులు | - | Sakshi
Sakshi News home page

నయా.. వంచకులు

Oct 31 2025 8:02 AM | Updated on Oct 31 2025 8:02 AM

నయా.. వంచకులు

నయా.. వంచకులు

నకిలీ దస్త్రాలతో భూదందా అడ్వాన్స్‌ రూపంలోనే రూ.లక్షలు కాజేత భూమి అప్పగించక, డబ్బులు తిరిగి ఇవ్వక సతాయింపు విసిగి వేసారుతున్న బాధితులు ఘర్షణలకు దారితీస్తున్న పరిస్థితులు

బెల్లంపల్లి: భూముల క్రయ విక్రయాల పేరుతో కొందరు కొనుగోలు దారులను నయవంచనకు గు రిచేస్తున్నారు. సాగులో ఉన్న, పడావుగా ఉన్న భూ ములకు నకిలీ దస్త్రాలు సృష్టించి రూ.లక్షల్లో అడ్వా న్స్‌ తీసుకుని ఏళ్లు గడుస్తున్నా భూమి అప్పగించకుండా, అడ్వాన్స్‌ డబ్బులు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నారు. గట్టిగా అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాము మోసపోయామని గుర్తించిన కొందరు బాధితులు అడ్వాన్స్‌గా తీసుకున్న డబ్బులు చెల్లించాలని నెల క్రితం బెల్లంపల్లి మండలం బట్వాన్‌పల్లిలో ఓ వ్యక్తి ఇంటికి వెళ్లి ఆందోళన చేసిన ఘటన మరువక ముందే పది రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన బెల్లంపల్లి మండల ప్రజా పరిషత్‌ మాజీ అధ్యక్షుడు సరిగ్గా అదే కారణంతో కిడ్నాప్‌ కావడం కలకలం సృష్టించింది. ఆ రెండు సంఘటనలు భూ విక్రయాల పేరుతో జరుగుతున్న మోసాలకు అద్దం పడుతున్నాయి.

సారవంతమైన భూములు చూపించి...

వ్యవసాయ భూముల క్రయ విక్రయాలకు బెల్లంపల్లి ప్రాంతం నెలవుగా మారింది. భీమిని, తాండూర్‌, కన్నెపల్లి, వేమనపల్లి, కాసిపేట, బెల్లంపల్లి, నెన్నెల మండలాల్లో సాగులో ఉన్న పట్టా భూములతో పాటు ఉద్యానవన తోటలు, పడావుగా ఉంటున్న భూములను అమ్మకానికి చూపిస్తున్నారు. సారవంతమైన భూములు కావడం, జల వనరులతో అలరారుతుండడంతో కొనుగోలుదారులు ఇష్టపడి అడ్వాన్స్‌ చెల్లించడానికి ముందుకు వస్తున్నారు. వీటిలో అనేక భూములు వివాదంలో ఉంటున్నాయి. నెలలు గడుస్తున్నా భూమిని పట్టా చేసి ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నారు.

సివిల్‌ కేసుల పరిధిలోకి రావడంతో...

భూ సమస్యలు, అమ్మకం, కొనుగోళ్లు, డబ్బుల వ్య వహారాలు సివిల్‌ కేసుల పరిధిలోకి వస్తాయి. కో ర్టుల ద్వారా మాత్రమే ఆయా సమస్యలను పరి ష్కరించుకోవాల్సి ఉంటుంది. సివిల్‌ తగాదాలను పో లీస్‌స్టేషన్‌లో పరిష్కరించరాదనే కోర్టు ఆదేశాలు ఉండటంతో భూ మోసాలు, నయవంచనలు పో లీసు అధికారుల దృష్టికి వెళ్లినా నిస్సహాయస్థితిలో ఉండిపోతున్నారు. దీంతో పెద్ద మనుషులు, తెలి సిన వ్యక్తుల సమక్షంలో మాట్లాడుకుని డబ్బుల చెల్లింపునకు ఒప్పంద పత్రాలు రాసుకుంటున్నారు. గడువు ప్రకారం డబ్బులు ముట్టజెప్పక పోవడంతో అమ్మకం, కొనుగోలు దారుల మధ్య ఘర్షణ వాతా వరణం నెలకొంటోంది. చివరికి బాధితులు కొందరు రౌడీలు, గూండాలను ఆశ్రయిస్తున్న పరిస్థితులు ఉంటున్నాయి. ఇంకొందరు రాజకీయ నేతలను ఆశ్రయించి వొత్తిళ్లు తీసుకు వస్తున్నారు. కాగా భూ అమ్మకాలకు సిద్ధపడిన వ్యక్తులు సైతం తామేం తక్కువ కాదన్నట్లు ఆకతాయి యువకులతో గ్యాంగ్‌లు మెయింటేన్‌ చేస్తున్నారు. ఏదిక్కూలేని బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. కేసు నమోదు చేసి నిందితులను కోర్టుకు తరలిస్తున్నా భూముల అక్రమ వ్యాపారం మాత్రం ఆగడం లేదు.

కొనుగోలు దారులంతా స్థానికేతరులే ...

రామగుండం, పెద్దపల్లి, కరీంనగర్‌, హైదరాబాద్‌, తదితర ప్రాంతాలకు చెందిన వ్యక్తులతో పాటు మంచిర్యాలకు చెందిన వ్యక్తులు కూడా భూములకోసం అన్వేషిస్తున్నారు. మరోవైపు భూ క్రయ విక్రయాలు సాగిస్తున్న కొంతమంది ఆయా ప్రాంతాలకు వెళ్లి తప్పుడు పత్రాల ఆధారంగా వారితో బేరం కుదుర్చుకుంటున్నారు. కనిష్టంగా రూ.10 లక్షల నుంచి గరిష్టంగా రూ.కోటికి పైగా వసూలు చేసిన ఉదంతాలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement