ఇందిరమ్మ బిల్లు ‘లక్ష’ణంగా అందజేత
వేమనపల్లి: ‘ఇందిరమ్మ బిల్లు కాజేసిన పోస్టుమాస్టర్’ శీర్షికన గు రువారం సాక్షిలో ప్రచురితమైన కథనం మండలంలో సంచలనం సృష్టించింది. బిల్లు స్వాహా చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన ఎంపీడీవో కుమారస్వామి పోస్టుమాస్టర్ శాంకతోపాటు బాధితురాలు పదిరె అంకు, కుటుంబ సభ్యులను మండల పరిష త్ కార్యాలయానికి పిలిపించారు. ఇరువర్గాల నుంచి వివరాలు సేకరించారు. పొరపాటుగా తాను బా ధితురాలి ఖాతా నుంచి ఆమెకు చెప్పకుండా రూ.లక్ష డ్రా చేసుకోవడం తప్పేనని పోస్టుమాస్ట ర్ అంగీకరించారు. గతంలో రూ.10వేలు ఇవ్వగా.. మిగతా రూ.90వేలు ఎంపీడీవో చేతుల మీదుగా బాధితులకు అందజేశారు. పింఛన్‌లో రూ.16 కోత విధించడంపై బాధితులు ఆందోళనకు దిగిన విష యం తెలిసిందే. ఇకముందు లబ్ధిదారులకు రూ.16 నగదు అందజేస్తానని పోస్టుమాస్టర్ అంగీకరించా రు. మరోసారి ఇలాంటి పొరపాట్లు పునరావృతం కానివ్వనని రాతపూర్వకంగా వివరణ ఇచ్చారు. ‘సాక్షి’ కథనంతో తమకు న్యాయం జరిగిందని బా ధితులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కుమురం రమేష్, నాయకులు జాడి గోపాల్, వెంకటేష్‌గౌడ్, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఎఫెక్ట్
ఇందిరమ్మ బిల్లు ‘లక్ష’ణంగా అందజేత


