డిజిటల్ మెడికల్ కార్డులు ఇవ్వాలి
మంచిర్యాలటౌన్: నవంబర్‌లో డిజిటల్ లైవ్ సర్టిఫి కేట్ సమర్పించేందుకు సీఎంపీఎఫ్ అధికారులు ఏరి యా వారీగా చేసే స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో భా గంగానే డిజిటల్ మెడికల్ కార్డులు ఇవ్వాలని సింగరేణి విశ్రాంత కార్మికులు కోరారు. జిల్లా కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. డిజిటల్ లైవ్ సర్టిఫికేట్ స్పెషల్ డ్రైవ్ కేంద్రాలను మంచిర్యాల, కరీంనగర్, హన్మకొండలో ఏర్పాటు చేయడం వల్ల విశ్రాంత పెన్షనర్లకు ఉ పయోగకరంగా ఉంటుందని అన్నారు. మీసేవా కేంద్రాలలో జీవన్ ప్రమాణ్ లైవ్ సర్టిఫికేట్ తీసుకోకపోవడం వల్ల గత ఏడాది దాదాపు ఐదు వేల మంది విశ్రాంత ఉద్యోగులకు కోల్‌మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ పింఛన్లు ఆగిపోయాయని అన్నారు. ఈ స మావేశంలో తెలంగాణ సింగరేణి రిటైర్మెంటు కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, నాయకులు చెలిమల అంజన్న, బీంసేన్, ఆర్. రాజేశం, కె.భిక్షపతి, జి.లింగయ్య, సుధీర్‌సేన్ పాల్గొన్నారు.


