అక్షరాస్యతలో ముందుండాలి
వేమనపల్లి: అక్షరాస్యతలో మండలాన్ని ప్రథ మ స్థానంలో నిలపాలని జిల్లా వయోజన విద్యాశాఖ అధికారి పురుషోత్తం నాయక్ అన్నారు. గురువారం స్థానిక మండల పరిష త్ కార్యాలయంలో ఎంపీడీఓ కుమారస్వామి అధ్యక్షతన ‘అమ్మకు అక్షరమాల’ శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని నిరక్షరాస్యులను గుర్తించి ఉల్లాస్ యాప్‌లో నమోదు చేశామన్నారు. అక్షరాస్యత శాతం పెంచేందుకు రాష్ట్ర స్థాయిలో శిక్షణ పొందిన సీఆర్పీలతో ప్రతీ గ్రామ సంఘం నుంచి ఇద్దరు ఓబీలకు, వీఓఏలకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. అందరూ సమన్వయం, అంకితభావంతో పని చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్ సత్యనారాయణమూర్తి ఎంఈఓ శ్రీధర్‌రెడ్డి, సీఆర్పీలు తిరుమల, అమీనా, డీఆర్పీ సుమన్ పాల్గొన్నారు.


