సంక్షేమం పట్టేదెవరికి..! | - | Sakshi
Sakshi News home page

సంక్షేమం పట్టేదెవరికి..!

Oct 31 2025 7:30 AM | Updated on Oct 31 2025 7:30 AM

సంక్షేమం పట్టేదెవరికి..!

సంక్షేమం పట్టేదెవరికి..!

● వరుస ఘటనలతో కలవరం ● విద్యార్థుల భద్రత, పర్యవేక్షణ గాలికి ● ఇన్‌చార్జీలు, డిప్యూటేషన్లతో సరి..

మంచిర్యాలఅర్బన్‌: సంక్షేమ వసతిగృహాల్లో వరుస సంఘటనలు కలవరపెడుతున్నాయి. తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థుల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. నిర్లక్ష్యం, అధికారుల మధ్య సమన్వయ లోపం, పర్యవేక్షణ లేమి వెరసి తల్లిదండ్రుల నమ్మకం సన్నగిల్లేలా చేస్తున్నాయి. జిల్లా స్థాయి అధికారుల నుంచి వార్డెన్ల వరకు ఇన్‌చార్జీలు కొనసాగడం, ఏదో ఒక కారణంగా బాధ్యతల నుంచి తప్పించడం, సస్పెండ్‌కు గురి కావడం, రెగ్యులర్‌ పోస్టు నుంచి డిప్యూటేషన్లు ఇవ్వడం అంతా షరా మామూలుగా మారింది. ఏసీబీ అధికారుల తనిఖీల్లో నిర్వహణ లోపం మొదలు విద్యార్థుల అస్వస్థత.. అనేక సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతిగృహాల్లో అనేక వివాదాలు చుట్టుముడుతున్నాయి.

ఎస్టీ హాస్టళ్లలో గందరగోళం

ఎస్టీ వసతిగృహాల పర్యవేక్షణ గాలికి వదిలేశారు. ఇన్‌చార్జీలు, డిప్యూటేషన్లతోనే సర్దుకుపోతున్నారు. గత ఏడాది నవంబర్‌ 6న ఎస్టీ బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనకు బాధ్యులను చేస్తూ జిల్లా స్థాయి అధికారి(ఎస్సీ డీడీ)తోపాటు హెచ్‌ఎంను సస్పెండ్‌ చేశారు. ఇదే పాఠశాలలో రెగ్యులర్‌ వార్డెన్‌ను కూడా జన్నారానికి డిప్యూటేషన్‌ చేశారు. వేధింపుల వ్యవహారంలో ఓ ఉపాధ్యాయుడిని బాబానగర్‌కు, పీడీని వేమనపల్లికి డిప్యూటేషన్‌ పంపించారు. సస్పెన్షన్‌కు గురైన హెచ్‌ఎంకు తిరిగి ఇదే పాఠశాలలో రెగ్యలర్‌ పోస్టు కేటాయించి వేమనపల్లి ఆశ్రమ పాఠశాలకు డిప్యూటేషన్‌పై పంపించారు. బియ్యం గోల్‌మాల్‌ ఘటనలో వేమనపల్లి ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎంను సస్పెండ్‌ చేసి తిరిగి అక్కడే రెగ్యులర్‌ పోస్టు ఇచ్చినట్లే ఇచ్చి మరో పాఠశాలకు డిప్యూటేషన్‌ ఇవ్వడంతో అంతా గందరగోళంగా మారింది. ఎస్టీ డీడీగా విధులు నిర్వర్తించి సస్పెండ్‌కు గురి కావడంతో నిర్మల్‌ అధికారిని ఇన్‌చార్జిగా నియమించారు. ఏమైందో ఏమోగానీ మూడు నెలలు గడవక ముందే ఆయన స్థానంలో ఓ అధికారిని నియమించారు. రెగ్యులర్‌ పోస్టును కాదని ఆయన ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు డిప్యూటేషన్‌పై వెళ్లడం ఏమిటో అర్థం కాని ప్రశ్న. ప్రస్తుతం కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా అధికారిని ఇన్‌చార్జిగా నియమించడం గమనార్హం. ఇదివరకు జిల్లాలోని ఎస్టీ హాస్టళ్ల నిర్వహణ లోపంపై ఏసీబీ అధికారుల తనిఖీల్లో వెలుగు చూడడంతో ప్రభుత్వానికి నివేదించినట్లు తెలుస్తోంది.

ఎస్సీ వసతిగృహం అంతేగా..

ఎస్సీ వసతిగృహాల్లోనూ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. హెచ్‌డబ్ల్యూవో, ఓ అధికారి వ్యవహార శైలిపై మంత్రికి విద్యార్థి సంఘాలు ఫిర్యాదు చేయ డం తెలిసిందే. బెల్లంపల్లిలో ఇన్‌చార్జిగా కొనసాగుతున్న వసతిగృహం సంక్షేమాధికారి వద్దంటూ వి ద్యార్థులు లేఖ రాయడం అప్పట్లో సంచలనంగా మారింది. మెనూ అమలు చేయాలంటూ రోడ్డెక్కారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవ చ్చు. ఇంత జరిగినా షోకాజ్‌ నోటీసుతో సరిపెట్టడంపై విమర్శలొస్తున్నాయి. జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ అధికారి(ఎస్సీ డీడీ)గా విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందడంతో ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీని ఇన్‌చార్జిగా నియమించారు. పదోన్నతిపై ఖాళీగా ఉన్న ఓ హెచ్‌డబ్ల్యూవో స్థానంలో ఏఎస్‌డబ్ల్యూవోకు ఇంచార్జిగా బాధ్యతలు కట్టబెట్టారు. గతంలో వార్డెన్‌గా ఉన్న సమయంలో చేసిన అవకతవకలపై జిల్లా అధికారికి ఫిర్యాదు చేసినా వెనకేసుకొచ్చినట్లు తెలుస్తోంది. బడ్జెట్‌ వచ్చినా ప్రోసీడింగ్‌ ఇవ్వకపోవడం, అధికారుల వేధింపులు తాళలేక లక్సెట్టిపేట వసతిగృహ సంక్షేమాధికారి రాజగోపాల్‌రావు ఆత్మహత్యాయత్నం చేసిన విష యం తెలిసిందే. విద్యార్థి సంఘాలు అధికారి చిట్టా తో కలెక్టర్‌, మంత్రికి ఫిర్యాదు చేయడం.. ఎట్టకేలకు ఇన్‌చార్జి బాధ్యతల నుంచి అతడిని తప్పించి మరో వార్డెన్‌ను నియమించడం గమనార్హం.

నిధులపై నిగ్గుతేలేనా..?

బీసీ వసతిగృహాల్లో వ్యవహారం మరోలా ఉంది. శాఖకు ఏమాత్రం సంబంధం లేని అధికారికి అప్పగించారు. ఇదే అదునుగా భావించిన అధికారి ఆ శాఖ బాధ్యతలు శాశ్వతమని భావించాడేమో తెలియదు కానీ.. కార్యాలయం(క్యాబిన్‌) కోసం ప్రభు త్వ నిధులు లేకుండా పనులు చక్కబెట్టారు. సార్‌ కూర్చునే గదితోపాటు మరో రెండు గదులకు రూ.3లక్షలతో వార్డెన్లు క్యాబిన్‌ చేయించారంటే ఆయన పనితీరును అర్థం చేసుకోవచ్చు. విద్యార్థుల సంఖ్యను బట్టి వా ర్డెన్లు నిధులు సమకూర్చాలని హూకుం జారీ చేసిన అదృశ్య శక్తి ఎవరో తెలియకుండాపోయింది. వార్డెన్లు ఇష్టానుసారంగా ని ధులు సమకూర్చారనే వాదనలూ లేకపోలేదు. అయితే.. రూ.3లక్షలకు పైగా ఎందు కు ఇచ్చారనేదే తెలియాల్సి ఉంది. ఇటీవల లక్సెట్టిపేట హాస్టల్‌లో నెలకొన్న వివాదంతో వార్డెన్‌ను సస్పెండ్‌ కాకుండా సరెండర్‌ చేయడంపై చర్చనీయాంశంగా మారింది. జిల్లా కేంద్రంలోని ఓ హాస్టల్‌కు తనిఖీకి వెళ్లినప్పుడు హాజరు పుస్తకంలో ఉన్నదానికంటే విద్యార్థులు తక్కువగా ఉన్నా.. ఓ విద్యార్థిపై చేయి చేసుకున్నా కిమ్మనకుండా ఉండడం వెనుక లోగుట్టు ఏమిటో తనిఖీ అధికారికే తెలియాలి. తనిఖీకి వెళ్లినప్పుడు శాఖకు సంబంధం లేని వ్యక్తులను తీసుకెళ్లడంపై వార్డెన్లు తప్పుపడుతున్నారు. మహనీ యుల వర్ధంతి, జయంతికి నిధులు మంజూ రైనా వార్డెన్లకు బరువు బాధ్యతలు అప్పగించారనే ఆరోపణలు లేకపోలేదు. అధికారి బాగోతంపై ఉన్నతాధికారులకు హెచ్‌డబ్ల్యూవోలు ఫిర్యాదులు చేయడమో..? ఏ మోగానీ అధికారిని బాధ్యతల నుంచి త ప్పించారు. అన్ని విషయాలపై నిగ్గు తేల్చేందుకు విచారణ చేపట్టనున్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఏబీసీడబ్ల్యూవోను ఇంచార్జిగా నియమించడం కొసమెరుపు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement