
తమిళనాడుకు తరలిన ఆదివాసీ కళాకారులు
ఇచ్చోడ: జిల్లాకు చెందిన ఆదివాసీ సకలకళా సంక్షేమ బృందం కళాకారులు శుక్రవారం త మిళనాడు రాష్ట్రానికి వెళ్లారు. తంజావూర్‌లో నిర్వహించనున్న ‘సెలంగై నా ధం’ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆదివాసీ కళా సంక్షేమ బృందానికి ఆహ్వానం అందిన ట్లు బృందం డైరెక్టర్ కాత్లె శ్రీధర్ తెలిపారు. కార్యక్రమంలో గుస్సాడీ, కొమ్ము, కోయ నృత్యాలు ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. తమిళనాడుకు బ యలుదేరిన వారిలో కళాకారులు కాత్లే ఆనంద్, రాము, రాజేంద్రప్రసాద్, లింగు, జలంధర్, దేవురావు, పవన్, సందీప్, లక్ష్మణ్, చరణ్, ఉదయ్, అక్షయ్, భీంరావు ఉన్నారు.