కాంగ్రెస్‌లో మాజీ సర్పంచులు, ఎంపీటీసీల చేరిక | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో మాజీ సర్పంచులు, ఎంపీటీసీల చేరిక

Published Sat, Apr 20 2024 1:25 AM

పార్టీలోకి ఆహ్వానిస్తున్న వివేక్‌, వంశీకృష్ణ  - Sakshi

చెన్నూర్‌: చెన్నూర్‌లోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో శుక్రవారం రాత్రి కోటపల్లి మండలానికి చెందిన బీఆర్‌ఎస్‌ మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలతోపాటు 200 మంది కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. చెన్నూర్‌ ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ వెంకటస్వామి, పెద్దపల్లి పార్లమెంట్‌ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వివేక్‌వెంకటస్వామి మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీల వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. పెద్దపల్లి పార్లమెంట్‌ అభ్యర్థి వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్‌, మాజీ జెడ్పీ వైస్‌ చైర్మన్‌ మూల రాజిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ పోటు రాంరెడ్డి, మాజీ సర్పంచ్‌ గొడిసెల బాపురెడ్డి, హిమవంతరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement