తూకం వేయరు.. తరలించరు..! | Sakshi
Sakshi News home page

తూకం వేయరు.. తరలించరు..!

Published Sat, Apr 13 2024 12:00 AM

హాజీపూర్‌ మండలం గుడిపేట కొనుగోలు కేంద్రంలో ధాన్యం - Sakshi

మంచిర్యాలఅగ్రికల్చర్‌: జిల్లాలో ధాన్యం కొనుగో లు కేంద్రాలు అట్టహాసంగా ప్రారంభించినా ధా న్యం సేకరణలో జాప్యం జరుగుతోంది. ధాన్యం ఎ ప్పుడు తూకం వేస్తారోనని రైతులు పడిగాపులు కా యాల్సి వస్తోంది. ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల ఒకటిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. గన్ని సంచులు సరఫరా చేయకపోవడంతో తూకం వేయడం లేదు. కేంద్రాలను రైస్‌మిల్లుల కు ట్యాగింగ్‌ చేయలేదు. జిల్లాలో పీఏసీఎస్‌ 86, ఐకేపీ 132, డీసీఎమ్మెస్‌ 38, మెప్మా 6 చొప్పున మొ త్తంగా 262 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ ఇప్పటివరకు ఒక్క క్వింటా ధాన్యం కూడా సేకరించి మిల్లులకు తరలించినట్లు రికార్డుల్లోకి ఎక్కలేదు. గన్ని సంచులు కేంద్రాలకు ఇవ్వకపోవడం, కొనుగోలు కేంద్రాల కేటాయింపులో స్పష్టత రాకపోవడంతో మిల్లుల కేటాయింపు జరగలేదు. గన్ని సంచులు అందిన చోట కేంద్రాలు, మిల్లులకు ట్యాగింగ్‌(కొనుగోలు కేంద్రం నుంచి కేటాయించిన మిల్లుకు) లేక ధాన్యం తరలింపు జరగడం లేదు. దీంతో ఏజెన్సీల నిర్వాహకులు ధాన్యం తూకం వేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. తూకం వేసి రోజుల తరబడి కేంద్రంలో నిల్వ చేస్తే మిల్లుకు తరలించిన సమయంలో బరువు తగ్గి నష్టపోవాల్సి వస్తుందని, తరుగు పేరుతో మిల్లర్లు కోత విధించే అవకాశం ఉందని నిర్వాహకులు వాపోతున్నారు.

భారీగా లక్ష్యం.. సేకరణ ఆలస్యం

జిల్లాలో ఈ ఏడాది 1,00,899 ఎకరాల్లో వరి సాగు కాగా, 2.20లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని, విత్తన కంపెనీ, రైతుల అవసరాలకు పోను కొనుగోలు కేంద్రాలకు 1.74లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశారు. 262 కేంద్రాల ఏర్పాటు లక్ష్యంగా నిర్దేశించారు. కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రైతులు కల్లాల్లో ధాన్యం ఆరబోసుకుని ఎదురు చూస్తున్నారు. ఎండలు ఎక్కువగా ఉండడంతో నాణ్యత, తేమ 17శాతం కన్న తక్కువగానే ఉంటుందని, కవర్లు అద్దెకు తీసుకొచ్చి కుప్పులపై కప్పుతున్నారు. తూకం ఆలస్యమయ్యే కొద్దీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోటెత్తుతోంది. ఒకేసారి తూకం వల్ల మిల్లుల వద్ద అన్‌లోడింగ్‌కు లారీలు రోజుల తరబడి ఎదురుచూపులు తప్పేలా లేవు. ఒక్కో మిల్లులో 20 నుంచి 25లారీలు బారులు తీరే అవకాశం ఉంది.

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎదురుచూపులు

మిల్లుల ట్యాగింగ్‌, తరలింపులో అలసత్వం

గన్ని సంచులు అవసరం 43.50 లక్షలు

అందుబాటు ఉన్నవి 30లక్షలు

ఇప్పటివరకు కేంద్రాలకు

సరఫరా చేసిన సంచులు 50 వేలు

కొనుగోలు కేంద్రాలు

ప్రారంభించి 12 రోజులు

ధాన్యం సేకరణ, మిల్లులకు తరలింపు : 0

Advertisement
 
Advertisement