
ఇది పార్ట్‌బీ ప్రశ్నాపత్రం, సమయం గంటన్నర ఇస్తారు. ఈసబ్జెక్టులో విషయ అవగాహన, స్వీయ విశ్లేషణ నైపుణ్యాలు అవసరం. పార్ట్ ఏ–30 మార్కులు, పార్ట్–బీ 10 మార్కులు ఉంటాయి. జీవశాస్త్ర పుస్తకంలో 10 పాఠ్యాంశాలకు మొదటి ఆరు పాఠాలు అనువంశికతపై విద్యార్థులు ఎక్కువ శ్రద్ధ చూపాలి. ప్రయోగాలపై అవగాహన అవసరం. అంశాల వారీగా చార్ట్‌లు, బ్లాక్ డయాగ్రమ్ సొంతంగా రూపొందించుకోవాలి. వాస్తవిక పరిస్థితులకు అన్వయిస్తూ పఠనం సాగాలి. ప్రయోగ నిర్వహణ ప్రక్రియపై ఎంత పట్టు ఉంటే అంత మంచిది.
– శోభారాణి, బయోసైన్స్, జెడ్పీహెచ్‌ఎస్ చంద్రవెల్లి, బెల్లంపల్లి
