బెల్లంపల్లి పట్టణానికి.....

ప్రైవేటు డెయిరీ పాడి రైతుల రిజిస్ట్రేషన్‌ కోసం నిర్వహించిన కార్యక్రమం(ఫైల్‌) - Sakshi

బెల్లంపల్లి పట్టణానికి చెందిన మర్రి రవికుమార్‌, తన సమీప బంధువు అమ్ముల కుమారస్వామి ఇద్దరు కలిసి పాల వ్యాపారం చేద్దామనుకున్నారు. ప్రైవేటు డెయిరీ చెప్పిన స్కీంలో ఐదు గేదెలు తీసుకోవాలని అనుకున్నారు. ఈ యూనిట్‌లో రైతు వాటాగా ఒక గేదెకు రూ.35వేల చొప్పున ఐదింటికి రూ.175లక్షలు చెల్లించారు. మిగతా మొత్తం రూ.3.25లక్షలు రుణం రూపంలో రైతు కంపెనీకి వాయిదా పద్ధతిలో చెల్లించాలి. పాల ఉత్పత్తిదారులుగా ఉంటూ తీసుకున్న రుణం ఇవ్వాలని చెబితే ఖాళీ చెక్కులు సైతం ఇచ్చారు. ఇందులో కుమారస్వామి తమ ఇంట్లో బంగారం అమ్మి పెట్టుబడి పెట్టాడు. గేదెలు ఇస్తారని హామీ ఇవ్వడంతో తమ భూమిలో ఓ షెడ్డు కట్టేందుకు సిద్ధమయ్యారు. అనుకున్న సమయానికి గేదేలు ఇవ్వకపోగా, సంస్థ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో చివరకు పోలీసుస్టేషన్‌లో కంపెనీ ప్రతినిధులపై ఫిర్యాదు చేశారు.

పాల డెయిరీ ప్రారంభమవుతుందని ఆ సంస్థ సిబ్బంది చెబితే బెల్లంపల్లి పట్టణానికి చెందిన శివ చక్రవర్తి పాల వ్యాపారం చేయాలనుకున్నాడు. ఆ సంస్థలో చేరి పాడిగేదెలు తీసుకుని స్వయం ఉపాధి పొందాలని అనుకున్నాడు. తన స్థాయి మేరకు రూ.2లక్షల యూనిట్‌ను ఎంపిక చేసుకుని రెండు గేదెల కోసం రూ.70వేలు చెల్లించాడు. మిగతా రూ.1.30లక్షలు రుణం రూపంలో కంపెనీ ఇస్తుందని చెబితే బ్యాంకులో డబ్బులు వేశాడు. అనుకున్నట్లుగా జరిగితే గేదెలు ఇచ్చాక రుణం వాయిదాల పద్ధతిలో చెల్లిస్తూ పాలను సంస్థకు పోయాలి. డబ్బులు చెల్లించి నెలలు గడుస్తున్నా గేదెలు ఇవ్వకపోవడంతో గత జనవరిలో పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇక అప్పటి నుంచి డబ్బులు కట్టి నష్టపోయామని, తమ డబ్బులు వస్తాయో లేదోనని ఆందోళన చెందుతున్నాడు.

Read latest Mancherial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top