
మాట్లాడుతున్న టీబీజీకేఎస్ నాయకులు
శ్రీరాంపూర్(మంచిర్యాల): శ్రీరాంపూర్‌లోని టింబర్‌యార్డు, ఏరియా స్టోర్స్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని టీబీజీకేఎస్ కేంద్ర ఉపాధ్యక్షులు డీ.అన్నయ్య, మంద మల్లారెడ్డి, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, కార్పొరేట్ చర్చల ప్రతినిధి ఏనుగు రవీందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం కార్మికులను కలిసి సమస్యలు తెలుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ స్టోర్స్ మెటీరియల్ ఇస్యూవర్ రెండు పోస్టులు ఏళ్ల తరబడిగా భర్తీ చేయడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఆయూనియన్ డెప్యూటీ జనరల్ సెక్రటరీ చాట్ల అశోక్, నాయకులు కాశీరావు, అద్దు శ్రీనివాస్, జీ.సదానందం, నీరటి లక్ష్మణ్, రమణారావు, విష్ణుప్రసాద్, నిరంజన్‌రెడ్డి, కుమారస్వామి, ఎడ్ల వెంకటయ్య, లంక రామస్వామి పాల్గొన్నారు.