భూసార సంరక్షణలో జీవన ఎరువులే కీలకం | - | Sakshi
Sakshi News home page

భూసార సంరక్షణలో జీవన ఎరువులే కీలకం

Jun 9 2026 8:52 AM | Updated on Jun 9 2026 8:52 AM

కొత్తకోట రూరల్‌: ఆధునిక వ్యవసాయంలో రసాయనిక ఎరువులు, కీటక, శిలీంధ్ర నాశిని మందులు వాడడం వల్ల భూ భౌతిక పరిస్థితి దెబ్బతినడం, నేలలో జీవకోటి మరణించడం, నీరు, వాయు కాలుష్యం పెరగడం చీడపీడల బెడద ఎక్కువై పంట, నేల ఉత్పాదకత క్షీణిస్తున్నాయి. అయితే రైతాంగం ‘జీవన ఎరువులను’ వాడి నేల సమతుల్యత కాపాడి దిగుబడులను పెంచుకోవచ్చని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.

జీవన ఎరువులు: ఇవి సహజంగా సూక్ష్మజీవుల సముదాయం. ప్రకృతిలో విరివిగా లభ్యమయ్యే ఉపయోగకరమైన సూక్ష్మజీవులు. ఇందులో కొన్ని మొక్కలతో సహజీవనం చేస్తూ నత్రజని మొక్కకు అందించడం, మరి కొన్ని భూమిలోని భాస్వరం కరిగించి ఎక్కువగా లభ్యమయ్యేటట్లు చేస్తాయి.

జీవన ఎరువుల రకాలు:

నత్రజనిని స్థీరికరించే జీవన ఎరువులు

ప్రకృతిలో సహజంగా ఉండే సూక్ష్మజీవులు ఈ నత్రజనిని స్థిరీకరించి మొక్కలకు అందజేస్తాయి. వీటి వల్ల పంటలలో దిగుబడి బాగా పెరుగుతుంది.

● సహజీవన నత్రజని జీవన ఎరువులు: రైడోబియం

● స్వేచ్ఛ జీవిత జీవన ఎరువులు: అజటం బాక్టర్‌, అజోస్పైరిల్లం, అజాల్లా మరియు నీలిపచ్చనాచు (బీజీఏ)

భాస్వరం కరిగించే జీవన ఎరువులు

నేలలో లభ్యం కాని స్థితిలో ఉన్న భాస్వరాన్ని మొక్కలకు కొన్ని రకాల సూక్ష్మ జీవులు అందుబాటులోకి తెస్తాయి. ఈ సూక్ష్మ జీవులైన బాసిల్లాస్‌, సుదోమొనాస్‌ సేంద్రియ పదార్థం వల్ల సమృద్ధిగా అందడం అలాగే భాస్వరం ఉన్న నేలల్లో వాడటం వల్ల ‘భాస్వరం’ లభ్యత మొక్కకు అధికంగా ఉంటుంది.

జీవన ఎరువులను వాడే విధానం..

జీవన ఎరువులను పంటల ఆధారంగా నాలుగు రకాలుగా వాడవచ్చు.

(1) విత్తనశుద్ధి: విత్తన మోతాదు, పరిమాణం బట్టి 200గ్రాముల నుంచి 500 గ్రాముల జీవన ఎరువును చిక్కటి బెల్లం, గంజి ద్రావణంలో కలిపి నీటిలో 20 నుంచి 30నిమిషాల వరకు ఆరబెట్టి విత్తుకోవాలి.

(2) నారు ముంచే పద్ధతి: నారు పంటలైన వరి, మిచ్చి, వంకాయ, టమోట, ఉల్లి మొదలైన పంటలకు అజోస్పైరిలం/అజటో బాక్టర్‌, ఫాస్పో బాక్టీరియా 1–2 కిలోల మిశ్రమాన్ని చిన్న బురద నీటి మడిలో కలిపి నారు వేర్లను 15–20 నిమిషాల వరకు ఉంచి తర్వాత ప్రధాన పొలంలో నాటాలి.

(3) నేరుగా భూమిలో వాడే పద్ధతి: ఎకరాకు 4కిలోల ఫాస్పో బాక్టీరియా, అజైస్పెరిల్లమ్‌ మిశ్రమాన్ని 50 కిలోల మక్కిన పశువుల ఎరువులో కలిపి చెట్టుకు 1–2 కిలోల మిశ్రమాన్ని 2కిలోల జీవన ఎరువును 10కిలోల పశువుల ఎరువుతో కలిపి ఒక ఎకరా పంట పొలంలో చల్లుకుంటే ఫలితం ఉంటుంది.

జీవన ఎరువు పంటలు నత్రజని స్థిరీకరణ కిలోలు దిగుబడి పెరుగుదల శాతం

(1)నత్ర జని ఎరువులు:

రైజోబియం వేరు శనగ,

సోయ చిక్కుడు, 50–60 10–30

కంది, పెసర, మినుము, పెసర్లు అజటో బాక్టర్‌ జొన్న, వరి ప్రొద్దుతిరుగు, పత్తి చెరుకు, రాగి

అజోస్పైరిల్లంఆముదం, 20–40 10–20 కూరగాయలు పండ్ల తోటలు

పూలతోటలు అడోల్లా వరి 20–30 10–15 నీలి ఆకుపచ్చ నాచువరి 20–30 10–15 (2)భాస్వరం కరిగించే ఎరువులు:

బసిల్లస్‌, సూడ్‌మిమోస్‌, అన్ని పంటలకు స్థిరపడిన భాస్వరాన్ని కరిగించి బయోఫాస్‌ మొక్కలకు అందిస్తాయి

పాడి–పంట

Advertisement
 
Advertisement
Advertisement