మక్తల్: నదిలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని పంచదేవ్‌పాడు గ్రామంలో సొమవా రం చోటుచేసుకుంది. పో లీసుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన బాల ప్ప (48) మద్యం మత్తులో ఆదివారం సాయంత్రం నది దగ్గరకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు కా లు జారి నదిలో పడిపోయాడు. అక్కడ ఉన్న వారు గమనించి అధికారులకు సమాచారం అందించగా వారు వచ్చి గాలించినా ఫలితం లేదు. సోమవారం నది పక్కన ఉన్న గుంత దగ్గర మృతదేహం లభ్యం కావడంతో బయట కు తీశారు. భార్య శంకరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించిన్నట్లు ఎస్‌ఐ రాజు తెలిపారు.
పాన్‌షాప్‌ల్లో మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠినచర్యలు
మహబూబ్‌నగర్ క్రైం: పాన్‌షాప్‌లలో మత్తు పదార్థాల విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తీ సుకుంటామని డీఎస్పీ వెంకటేశ్వర్లు దుకాణాదారులను హెచ్చరించారు. వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న దుకాణదారులతో సోమవారం రాత్రి వన్‌టౌన్ స్టేషన్‌లో అవగాహన సమావేశం నిర్వహించారు. పాన్‌షాప్‌లలో గుట్కాలు, ఖైనీ, నిషేధిత పొగాకు ఉత్పత్తులు, మత్తు పదార్థాలు విక్రయించి యువతను వ్యసనాలకు గురిచేస్తే చట్ట ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నా రు. పాఠశాలలు, కళాశాలల సమీ పం ప్రాంతాల్లో ఉన్న దుకాణదారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మైనర్లకు పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే కేసులు మరింత కఠినంగా ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో సీఐ అప్పయ్య, ఎస్‌ఐ శీనయ్య పాల్గొన్నారు.
రాజ్యాంగ
హక్కులపై అవగాహన
కొల్లాపూర్ రూరల్: మండలంలోని అమరగిరి గ్రామంలో చెంచు కాలనీలో రాజ్యాంగ హక్కులపై చెంచులకు నాగర్ కర్నూల్ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో లీగల్ అవేర్‌నెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సదస్సులో డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శ్రీరామ్ ఆర్య పాల్గొని ఆదివాసీల యోగక్షేమాలు, జీవన పరిస్థితులు, సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న వైద్యం, విద్యా సదుపాలయాలపై ఆరా తీశారు. ఏమైనా సమస్యలు ఉంటే జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమస్యల పరిష్కారానికి సంస్థ తరఫున పూర్తి సహకారం అందిస్తామన్నారు. చిన్నారులు బాగా చదివి ఉన్నత లక్షా లు సాధించాలని ప్రోత్సహించారు. విద్యార్థుల జీవి త లక్ష్యాలను తెలుసుకుని వారిక మార్గనిర్దేశం, చేశా రు. ఆర్థికంగా బలహీనులైన న్యాయవాదిని నియమించుకోలేని వారికి ఉచిత న్యాయ సహయం అందిస్తామని హమీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ లింగమ్మ, మాజీ సర్పంచ్ నిరంజన్, వార్డు మెంబర్ భరత్, నేషనల్ ఆదివాసీ హక్కుల సంఘం సభ్యు లు, చెంచుకుటుంబాలు, గ్రామస్తులు పాల్గోన్నారు.


