చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు | - | Sakshi
Sakshi News home page

చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు

Jun 9 2026 8:52 AM | Updated on Jun 9 2026 8:52 AM

టిప్పర్‌లో మట్టి నింపుతున్న జేసీబీ

టిప్పర్ల ద్వారా మట్టి తరలింపు

చారకొండ: మండలంలోని జూపల్లి గ్రామ శివారు పరిఽఽధిలోని చింత చెరువులో నుంచి కొందరు అక్రమార్కులు అనుమతి లేకుండా అక్రమంగా ఒండ్రుమట్టిని తరలిస్తున్నారు. జేసీబీతో తవ్వకాలు జరిపి టిప్పర్ల ద్వారా తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండు రోజులుగా చెరువు నుంచి రాత్రి వేళ గుట్టు చప్పుడు కాకుండా మట్టిని తరలిస్తునట్లు సమాచారం. సమీప వ్యవసాయ పొలాల రైతులు రాత్రి సమయాల్లో గమనించి అక్రమంగా మట్టి తరలిస్తున్నారని 100కు సమాచారం ఇచ్చారు. దీంతో మరల ఏకంగా సోమవారం పట్టపగలు చెరువు నుంచి తవ్వకాలను కొనసాగిస్తుండడంతో సమీప రైతులు ,గ్రామస్తులు చెరువులో ఒండ్రు మట్టిని తరలించొద్దని రైతులు అడ్డుకొని ఆందోళన చేశారు. మట్టి తరలింపుపై అనుమతులు ఉన్నాయా అని నిలదీశారు. దీంతో రైతులు మట్టిని తరలించకుండా అడ్డుకొని ఆందోళన చేశారు. విషయాన్ని స్థానిక రైతులు చారకొండ పొలీసులకు సమాచారం ఇవ్వడంతో చెరువు వద్దకు పోలీసులు చేరుకొని మట్టి తవ్వకాలను నిలిపివేసి అక్కడి నుంచి వాహనాలు స్టేషన్‌కు తరలించకుండా వదిలేశారు. అనుమతులు లేకుండా మట్టి తరలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంపై ఉన్నత అధికారులు వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement