కూలీలు రావడం లేదు.. | - | Sakshi
Sakshi News home page

కూలీలు రావడం లేదు..

Jun 9 2026 8:52 AM | Updated on Jun 9 2026 8:52 AM

మా పొలంలో వరి, బెండ పంటలను సాగు చేశాను. మా పొలం సమీపంలోనే పెద్ద మొత్తంలో చేపల చెరువులను సాగుచేస్తున్నారు. చేపలకు నిత్యం కుళ్లిన చికెన్‌ వ్యర్థాలను, కుళ్లిన కోడిగుడ్లను ఉడికించి ఆహారంగా వేస్తున్నారు. దీంతో దుర్వాసన అధికంగా వస్తుండటంతో అనారోగ్యాలకు గురవుతున్నాం. వాసన వల్ల కూలీలు సైతం మా పొలానికి రావడంలేదు.

– వెంకట్రాముడు, రైతు, జింకలపల్లి.

ఆరోగ్యంతో చెలగాటమాడితే చర్యలు

చేపలకు ఆహారంగా కోళ్ల వ్యర్థాలు, కుళ్లిన కోడిగుడ్లు వేయడం చట్టరీత్యా నేరం. ప్రభుత్వం నిషేధించిన వ్యర్థాలతో చేపలను సాగుచేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవు.

– శ్రీకాంత్‌రెడ్డి, తహసీల్దార్‌, ఇటిక్యాల

కేసులు నమోదు చేస్తాం..

కోళ్ల వ్యర్థాలను చేపల చెరువులకు తరలిస్తే క ఠిన చర్యలు తీసుకుంటాం. పలుమార్లు చికె న్‌ వ్యర్థాలను తరలిస్తూ పట్టుబడిన వాహనాల ను అదుపులోకి తీసుకొని పీఎస్‌లకు తరలించి మత్స్యశాఖ అధికారులకు సమాచారం అందించాం. – ప్రదీప్‌కుమార్‌, సీఐ, అలంపూర్‌

Advertisement
 
Advertisement
Advertisement