27 కాటన్ల మద్యం పట్టివేత
చిన్నంబావి: మండలంలోని భారీగా మద్యం పట్టుకున్న ఘటన మండలంలో చోటు చేసుకున్నది. ఎస్‌ఐ నాగరాజు వివరాలు ప్రకారం.. మండలంలో మియాపూర్ గ్రామంలో సప్తగిరి రైస్‌మిల్‌లో అక్రమంగా మద్యం ఉందని నమ్మదగిన వ్యక్తుల సమాచారం మేరకు 27 కాటన్ల మద్యం పట్టుకున్నారు. వీటి విలువ రూ.2.56లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసునమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
రూ.1.27 లక్షలు పట్టివేత
అమరచింత: ఎన్నికల సందర్భంగా మస్తీపురం ఎక్స్‌రోడ్‌లో సోమవారం వాహనాలను తనిఖీ చేస్తుండగా రూ.1.27లక్షలు స్వాధీనం చేసుకున్నామని ఎస్‌ఐ స్వాతి తెలిపారు. ఆత్మకూర్ పట్టణానికి చెందిన శ్రీనివాసులు తన వాహనంలో రూ.1.27లక్షలతో వెళ్తుండగా వాహనాన్ని తనిఖీ చేశామన్నారు. నగదుకు సంబంధించిన రసీదులు లేని కారణంగా డబ్బును స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎవరైనా రూ.50వేలకంటే అధికంగా తీసుకెళ్లారాదన్నారు.
చెక్‌పోస్టు వద్ద నగదు పట్టివేత
గోపాల్‌పేట: మండలంలోని బుద్దారం జిల్లా చెక్‌పోస్టు వద్ద పోలీసులు భారీగా నగదు పట్టుకున్నారు. గోపాల్‌పేట ఎస్‌ఐ నరేశ్‌కుమార్ కథనం ప్రకారం.. అచ్చంపేట నుంచి కడపకు ఓ వ్యక్తి రూ.4,80,000 తరలిస్తుండగా డబ్బులకు సంబంధించిన పత్రాలు చూపించమని కోరారు. తాను గొర్రెలు కొనుగోలు చేసి తీసుకొచ్చేందుకు వెళ్తున్నానని చెప్పాడు. డబ్బుల తరలింపునకు సంబంధించి సరైన పత్రాలు చూపించాలని చెప్పారు. డబ్బులను ఉన్నతాధికారులకు అందిచనున్నామని తెలిపారు. ప్రజలు రూ.50వేల నగదుకు మించి డబ్బులను వెంట తీసుకెళ్లవద్దని తెలిపారు.


