ఖాళీ చేయించాం..
‘మహాకేఫ్’లో కేవలం టీ, ఐస్‌క్రీం మాత్రమే అందుబాటు లో ఉంచినట్లు మా పరిశీలనలో తేలింది. దీనిపై ఆర్‌పీ పద్మ నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో ఉన్నతాధికారుల సూచన మేరకు నోటీసులిచ్చి ఇటీవల ఖాళీ చేయించాం. ఇక బేకరీ, తినుబండారాల తయారీపై హైదరాబాద్‌లో శిక్షణ తీసుకున్న 13మంది ఎస్‌హెచ్‌జీ మహిళలకు టీఎల్‌ఎఫ్ ఆధ్వర్యంలో అప్పగించాలని నిర్ణయించాం. అవసరమైన పదార్థాలు, ఇతర ముడిసరుకుల కొనుగోలుకు బ్యాంకుల ద్వారా రుణం సైతం ఇప్పిస్తాం. దీనిని బాగా నడిపిస్తే మహిళలకు ఎంతో ఉపాధి లభిస్తుంది. – మహమ్మద్ యూసుఫ్, మెప్మా పీడీ


