మక్తల్‌కు బ్రహ్మోత్సవ శోభ
మక్తల్: భక్తుల కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీర్చే దైవంగా విరాజిల్లుతున్న మక్తల్ పడమటి ఆంజనేయస్వామి క్షేత్రం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. మంగళవారం నుంచి ఈ నెల 9వ తేదీ వరకు 8 రోజులపాటు కొనసాగే బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆలయ పరిసరాలను విద్యుద్దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మార్గశిర మాసం పౌర్ణమి రోజున స్వామివారి రథోత్సవం వైభవోపేతంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఉత్సవాలను తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వేలాది భక్తులు తరలివచ్చి స్వామివారికి తమ మొక్కులు తీర్చుకుంటారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ధర్మకర్త ప్రాణేశ్ ఆచారి, ఈఓ కవిత తెలిపారు.
కోనేరు పునఃప్రారంభం..
ఏళ్ల తరబడి శిథిలావస్థలో ఉన్న ఆలయ కోనేరు ను ఇటీవల రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి చొరవతో ఇటీవల ఆధునికీక రించారు. ఇందుకోసం రూ. 60లక్షలు వెచ్చించా రు. ఈసారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించేలా తీర్చిదిద్దారు.
కార్యక్రమాలు ఇలా..
● 2న ఉదయం 7 గంటలకు ఉత్తరాది మఠం నుంచి స్వామివారి ఉత్సవ మూర్తితో ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని 7:30 గంటలకు ఉత్సవాలకు అంకుర్పాణ, ధ్వజారోహణ, అలంకారణోత్సవం, 9:30 గంటలకు హనుమద్వ్రతం, సాయంత్రం గజవాహన సేవ నిర్వహించనున్నారు.
● 3న ఉదయం పవన హోమం, సాయంత్రం నెమలి వాహన సేవ, 6 గంటలకు
ప్రభోత్సవం ఉంటుంది.
● 4న సాయంత్రం 6 గంటలకు రథోత్సవ ప్రారంభమవుతుంది.
● 5న సాయంత్రం 5 గంటలకు
హంస వాహన సేవ, 6:30 గంటలకు పాల
ఉట్ల కార్యక్రమం నిర్వహించనున్నారు.
● 6న ఉదయం 10 గంటలకు చక్రతీర్థస్నానం, 11 గంటలకు అశ్వవాహన సేవ
కార్యక్రమం ఉంటుంది.
● 7న హంస వాహన సేవ.
● 8న ఉష్ట్ర వాహన సేవ.
● 9న కల్పవృక్ష వాహన సేవ అనంతరం పూలరథం, పల్లకీ సేవ కార్యక్రమం నిర్వహించనున్నారు.
పడమటి ఆంజనేయస్వామి
నేటి నుంచి
పడమటి ఆంజన్న ఉత్సవాలు
4న స్వామివారి రథోత్సవం
రూ. 60లక్షలతో ఆలయ కోనేరు ఆధునికీకరణ


