గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): మీకు తెలుసా.. గ్రామ పాలనలో సర్పంచ్ పదవి చాల బాధ్యాయుతమైందని. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్ పదవికి ఉండే అధికారం, విధులు, బాధ్యతలపై ఓ లుక్కెద్దాం.
● సర్పంచ్‌గా ఎన్నికై తే అయిదేళ్లపాటు గ్రామ ప్రథమ పౌరుడి హోదా దక్కుతుంది.
● ప్రొటోకాల్ ప్రకారం అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానం ఉంటుంది.
● వీరి సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం నెలకు రూ.6,500 గౌరవ వేతనం అందిస్తుంది.
● కనీసం నెలకు ఒకసారి పంచాయతీ, పాలకవర్గ సమావేశం, రెండు నెలలకు ఒకసారి గ్రామ పంచాయతీ ఆదాయ వ్యయాల ఖాతాలను ఆడిటింగ్ చేయించాలి.
● నిధులను గ్రామాభివృద్ధికి సక్రమంగా వినియోగించాలి.
● గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణకు చర్యలు చేపట్టాలి.
● రెండు నెలలకోసారి చొప్పున వరుసగా మూడు పర్యాయాలు గ్రామసభ నిర్వహించకపోతే చట్టంలోని 33 సెక్షన్ ప్రకారం సర్పంచ్ పదవి కోల్పోతారు.
● అవినీతి ఆరోపణలపై నిరూపణ జరిగితే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 8 ప్రకారం పదవిపై వేటు పడుతుంది.
● గ్రామ పంచాయతీ ఆడిట్, లెక్కలు పూర్తి చేయకపోతే సెక్షన్ 23 ప్రకారం అనర్హత వేటు ఉంటుంది.
● వార్డు సభ్యులంతా పాలకవర్గంగా ఉంటారు. వీరిలో ఒకరు ఉప సర్పంచ్‌గా వ్యవహరిస్తారు. వీరికి పారితోషికం, గౌరవ వేతనం లేదు. వార్డు సభ్యులు వరుసగా మూడు సమావేశాలకు, మహిళా సభ్యులు ఆరు సమావేశాలకు గైర్హాజరైతే కలెక్టర్ ద్వారా అనర్హత వేటు పడుతుంది.
కోడూర్ గ్రామ పంచాయతీ భవనం


