ఒట్టేసి చెబుతున్నాం.. ఓట్లు వచ్చేలా చూస్తాం
అచ్చంపేట రూరల్: పంచాయతీ ఎన్నికల వేళ గ్రామాల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నెల 3 నుంచి నియోజకవర్గంలోని అచ్చంపేట, ఉప్పునుంతల, లింగాల, బల్మూర్, అమ్రాబాద్, పదర, చారగొండ మండలాల్లో మూడో విడత నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పలు గ్రామాల్లో సర్పంచ్, వార్డుల సభ్యుల ఎన్నిక కోసం అభ్యర్థులను ఆయా పార్టీల నాయకులు వెతుకుతున్నారు. ఈ క్రమంలో సోమవారం సిద్ధాపూర్ గ్రామ శివారులోని గుర్రాలబండ వద్ద ఉన్న ఆంజనేయస్వామి విగ్రహం ఎదుట కాంగ్రెస్ పార్టీ మద్దతు దారులైన సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా వారి చేత ప్రమాణం చేయించారు. వార్డు మెంబర్ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పడుతాయో.. అన్ని ఓట్లు తప్పకుండా సర్పంచ్ అభ్యర్థికి వేయించే బాధ్యత మాదేనంటూ వార్డు మెంబర్ అభ్యర్థులు
ప్రమాణం చేశారు. స్థానిక ఎమ్మెల్యేకు గిఫ్ట్‌గా ఇద్దామనే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


