
పాలమూరు యూనివర్సిటీ అభివృద్ధికి కృషి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నట్లు యూనివర్సిటీ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన రాష్ట్ర ఉన్నత విద్యా కమిషనర్ దేవసేన , రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల వైస్‌ఛాన్స్‌లర్‌ల సమావేశంలో ఆయన పాల్గొని న్యాక్ యాక్టివిటీస్, బడ్జెట్ ప్రపోజల్స్, యూనివర్సిటీ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పీయూలో విద్యార్థులకు వసతుల కల్పన, నాణ్యమైన విద్యను అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకృష్టారెడ్డి, పీయూ రిజిస్ట్రార్ రమేష్‌బాబు, ఐక్యూఏసీ డైరెక్టర్ మదుసూదన్‌రెడ్డి, కోఆర్డినేటర్ కరుణాకర్‌రెడ్డి , ఈశ్వర్, అర్జున్‌కుమార్, గౌస్ పాల్గొన్నారు.