
జీజీహెచ్‌కు సుస్తీ
జనరల్ ఆస్పత్రిలో వైద్యం అందేది 3 గంటలే..!
పాలమూరు: జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు.. అంటే కేవలం 3 గంటలు మాత్రమే వైద్యం అందుతుంది. ఆ తర్వాత ఎంత ఎమర్జెన్సీ వైద్యం కావాల్సి ఉన్నా.. సీనియర్ వైద్యులు ఉండరు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన రోగులకు ఎలాంటి వైద్యం చేయాలనే విషయంపై జూనియర్స్‌కు సరైన అవగాహన లేకపోవడంతో బాధితులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొందరు ప్రైవేట్ ఆస్పత్రులకు.. మరికొందరు హైదరాబాద్‌కు వెళుతున్నారు. ఎలాంటి ఆధారం లేని పేదలు అక్కడే ఉంటూ ఇబ్బందులు పడుతున్నారు.
● జీజీహెచ్‌లో ఇప్పటికీ గుండె సమస్యలు, గ్యాస్ట్రో, న్యూరాలజీ, యూరాలజీ ఇలా కీలకమైన విభాగాలు వైద్యులు లేరు. గుండెపోటు లక్షణాలతో వచ్చిన వారికి కనీస చికిత్స ఇవ్వడానికి అవసరమైన డాక్టర్ లేకపోవడం పెద్దలోటు.
● వార్డులతో పాటు మరుగుదొడ్లు, ఆస్పత్రి ఆవరణలో ఎక్కడ చూసినా అపరిశుభ్రతనే దర్శనం ఇస్తోంది. శానిటేషన్ నిర్వహణ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఓపీలు మొదలైన తర్వాత ఉదయం 9 గంటలకు ఓపీ గదులు శుభ్రం చేయడం కనిపించింది.
మధ్యాహ్నం తర్వాత కనిపించని సీనియర్, జూనియర్ వైద్యులు
అత్యవసర వైద్యం కోసం వస్తే అవస్థలే
ఓపీలో సమయపాలన పాటించని వైనం
అందుబాటులో లేని మందులు
పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తం
‘సాక్షి’ విజిట్‌లో తేలిని పలు అంశాలు