ప్రైవేట్‌ క్లినిక్‌లలో తనిఖీలు | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ క్లినిక్‌లలో తనిఖీలు

Published Sat, May 18 2024 6:30 AM

ప్రైవేట్‌ క్లినిక్‌లలో తనిఖీలు

భూత్పూర్‌: మున్సిపాలిటీతో పాటు కొత్త మొల్గర, ఎల్కిచర్లలో ప్రైవేట్‌ క్లినికల్‌లను శుక్రవారం జిల్లా మాస్‌ మీడియా అధికారి తిరుపతిరావు తనిఖీలు చేపట్టారు. ఆర్‌ఎంపీలు ప్రైవేట్‌ క్లినిక్‌లలో ప్రథమ చికిత్సను అందిస్తూ రోగులకు సలహాలు, సూచనలతో పాటు పెద్ద ఆస్పత్రులకు వెళ్లేలా సూచించాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వైద్య పరీక్షలు చేస్తున్నట్లు, సైలెన్‌ ఎక్కించడం, బోర్డులపై డాక్టర్‌లుగా రాసినట్లు గుర్తించినట్లు తెలిపారు. మున్సిపాలిటీలోని అమ్మ క్లినిక్‌లో రోగులకు సైలెన్‌ ఎక్కించడంతో పాటు ఓ షటర్‌లో సైలెన్‌ ఎక్కించడానికి 4 బెడ్లు వేసినట్లు గుర్తించారు. అమ్మ క్లినిక్‌ నిర్వహిస్తున్న సంతోష్‌పై చర్యలు తీసుకోనున్నట్లు, రెండు క్లినిక్‌లు నిర్వహిస్తున్న ఇద్దరు డాక్టర్లుగా బోర్డు రాసుకున్న వారికి నోటీసులు జారీ చేసినట్లు అధికారి తెలిపారు. సీహెచ్‌ఓ అయ్యుబ్‌ఖాన్‌, హెల్త్‌ అసిస్టెంట్‌ ప్రమోద్‌కుమార్‌, సిబ్బంది ఉన్నారు.

మూసుకున్న ప్రైవేట్‌ క్లినిక్‌లు

విషయం తెలుసుకున్న నిర్వాహకులు క్లినిక్‌లను మూసేసి వెళ్లారు. పట్టణంలో ప్రైవేట్‌ క్లినిక్‌లు నిర్వహిస్తున్న వారు వైద్యులుగా చెలామణి అవుతూ జిల్లాలోని ప్రైవేట్‌ ఆస్పత్రులకు రోగులను పంపిస్తూ వారి నుంచి కమీషన్‌ తీసుకుంటున్నారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement