జిల్లాలోని పెట్రోల్‌ బంక్‌లకు మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా | Sakshi
Sakshi News home page

జిల్లాలోని పెట్రోల్‌ బంక్‌లకు మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా

Published Wed, Jan 3 2024 4:38 AM

- - Sakshi

జిల్లాలోని పెట్రోల్‌ బంక్‌లకు మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా వాహనదారులు ఒక్కసారిగా పోటెత్తడంతో బంకులన్నీ కిక్కిరిసిపోయాయి. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన భారత న్యాయ సంహిత చట్టంలో హిట్‌ అండ్‌ రన్‌ కేసుల్లో నిబంధనలను కఠినతరం చేయడాన్ని నిరసిస్తూ ట్రక్కు డ్రైవర్లు సమ్మెబాట పట్టారు. దీంతో వంటగ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ట్యాంకర్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడుతుందన్న భయంతో వాహనదారులు పెట్రోల్‌ బంక్‌లకు క్యూ కట్టారు. ఇప్పటికే పలుచోట్ల నో స్టాక్‌ బోర్డులు పెట్టడంతో పెట్రోల్‌, డీజిల్‌ వాహన చోదకులు ఉరుకులు.. పరుగులు పెట్టారు. అయితే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌ ధరలు తగ్గించబోతుందని సమాచారం ఉన్నందున బంకుల యజమానులు తెప్పించుకోలేదని, దాని వల్లే కొరత ఏర్పడిందని ఓ వాదన వినిపిస్తుండగా.. మరోపక్క ట్రక్కు డ్రైవర్లు సమ్మె చేస్తుండడంతోనే కొరత ఏర్పడిందని పేర్కొంటున్నారు. ఈ విషయమై జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శ్రీనివాస్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా వాహనదారులు వదంతులు నమ్మవద్దని కోరారు.

– మహబూబ్‌నగర్‌ రూరల్‌

1/2

2/2

Advertisement
 

తప్పక చదవండి

Advertisement