కొనసాగుతున్న ఎస్‌జీఎఫ్‌ రాష్ట్రస్థాయి క్రీడలు | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న ఎస్‌జీఎఫ్‌ రాష్ట్రస్థాయి క్రీడలు

Published Thu, Dec 7 2023 12:26 AM

హైదరాబాద్‌, మెదక్‌ జట్ల మధ్య పోటీ - Sakshi

గద్వాల అర్బన్‌: పట్టణంలోని ఇండోర్‌ స్టేడియంలో ఎస్‌జీఎఫ్‌ 67వ రాష్ట్రస్థాయి అండర్‌–17 బాలుర క్రికెట్‌ పోటీలు రెండోరోజు బుధవారం హోరాహోరీగా సాగాయి. హైదరాబాద్‌, మెదక్‌ జట్లు తలబడగా హైదరాబాద్‌ విజయం సాధించింది. అదేవిధంగా నల్గొండపై రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌పై ఖమ్మం, వరంగల్‌పై ఆదిలాబాద్‌, హైదరాబాద్‌పై ఆదిలాబాద్‌ జట్టు విజయం సాధించాయి. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాఘవరెడ్డి, డీవైఎస్‌ఓ బీఎస్‌ ఆనంద్‌, పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు తిమ్మారెడ్డి, ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శి జితేందర్‌, కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీనివాసులు, సుధాకర్‌రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య పాల్గొన్నారు.

 
Advertisement
 
Advertisement