అట్టహాసంగా కబడ్జీ జట్టు ఎంపిక | Sakshi
Sakshi News home page

అట్టహాసంగా కబడ్జీ జట్టు ఎంపిక

Published Mon, Nov 27 2023 1:10 AM

- - Sakshi

లింగాల: మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలుర గురుకుల పాఠశాల ఆవరణలో ఆదివారం రాష్ట్ర స్థాయి పోటీలకు సీనియర్‌ మహిళా కబడ్జీ జట్టు ఎంపికలు పీడీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా నలుమూలల నుంచి 70 మంది మహిళా క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రతిభ కనబర్చిన 12 మందిని ఎంపిక చేశారు. వీరు డిసెంబర్‌ 4వ తేదీ నుంచి 6 వరకు నిజామాబాద్‌ జిల్లా బుస్సాపూర్‌లో 70వ తెలంగాణ రాష్ట్రస్థాయి చాంపియన్‌ షిప్‌ పోటీల లో పాల్గొంటారని జిల్లా అధ్యక్ష, కార్య దర్శులు జనార్దన్‌రెడ్డి, యాదయ్యగౌ డ్‌ తెలిపారు. కార్యక్రమంలో కుమారస్వామి, మోహన్‌లాల్‌, రమేష్‌, అబ్దుల్లా పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement