దుగ్గొండి: నాపేరు లక్ష్మణ్. నేను దుగ్గొండి మండలం నాచినపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాను. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో నాఫ్రెండ్స్‌తో కలిసి చేయి తడవకుండా నాణేన్ని తీసే ప్రయోగం చేశాను. ప్లేట్‌లో నీరు పోసి అందులో ఒక నాణెం వేశాను. ఆ నీటిలో ఉన్న కాయిన్‌ను చేయి తడవకుండా తీయమన్నాను. ఎవరూతీయలేదు. అప్పుడు నేను ఓ కొవ్వొత్తి తీసుకొచ్చి ప్లేట్‌లో నాణానికి పక్కన పెట్టి వెలిగించాను. వెలుగుతున్న కొవ్వత్తిపై గ్లాస్‌ను బోర్లించడంతో కొవ్వొత్తి ఆరిపోయింది. అప్పుడు ప్లేట్‌లో ఉన్న నీరంతా గ్లాస్‌లోకి వెళ్లింది. ఆ వెంటనే చేయి తడవకుండా కాయిన్ తీశాను.
నేను
గీసిన
బొమ్మ


