జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి

May 23 2026 1:28 AM | Updated on May 23 2026 1:28 AM

పంట మార్పిడి పద్ధతి అనుసరించాలి

యూరియా వాడకం తగ్గించాలి

కలెక్టర్‌ స్నేహశబరీష్‌

మహబూబాబాద్‌: అన్నిశాఖల అఽధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లా అభివృద్ధికి పాటుపడాలని కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ అన్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99రో జుల కార్యక్రమంలో భాగంగా జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. మొదట అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించారు. అనంతరం కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ మాట్లాడుతూ.. ప్రజాపాలన కార్యక్రమంలో మండల స్థాయిలో 1,158 దరఖాస్తులు వచ్చాయని, అందులో 70శాతం పింఛన్‌కు సంబంధించినవి, 30శాతం సీసీ రోడ్లు, తాగునీటికి సంబంధించినవి ఉన్నాయన్నారు. అధికారుల పరిధి లో ఉన్నవి పరిష్కరించినట్లు తెలిపారు. అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో రాష్ట్రంలో జిల్లా ఆరోస్థానంలో ఉందన్నారు. జిల్లాకు 10,600 ఇళ్లు మంజూరు కాగా, సుమారు 2,000 ఇళ్లు పూర్తి అయినట్లు తెలిపారు. జిల్లాలో 8,000 మంది పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రాస్తే కేవలం 97మంది ఫెయిల్‌ అయినట్లు పేర్కొన్నారు. రైతులు పంట మార్పిడి పద్ధతిని అవలంభించాలని సూచించారు. జిల్లాలో వరి, మొక్కజొన్న పంటలను మాత్రమే ఎక్కువగా సాగు చేస్తున్నారని, ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని అన్నారు, యూరియా ఎక్కువ మోతాదులో వాడడం వల్ల భూసారం దెబ్బతింటుందన్నారు. బాల్య వివాహాలను అరికట్టాలన్నారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేశామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ అనిల్‌కుమార్‌, ఇన్‌చార్జ్‌ అదనపు కలెక్టర్‌ పురుషోత్తం, ఆర్డీఓలు కృష్ణవేణి, గణేష్‌, డీఎస్పీ తిరుపతి రావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు గుగులోత్‌ జ్యోతి, ప్రగతి, రాజకుమారి, సునీత, జిల్లాస్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement