ఎయిడ్స్ నివారణలో భాగస్వాములు కావాలి
● డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్
గార్ల: ఎయిడ్స్ వ్యాధి నివారణలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్ సూచించారు. సోమవారం గార్ల నిర్మలా హైస్కూల్‌లో జాతీయ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని వ్యాధి నివారణపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఎయిడ్స్ సోకకుండా ఉండేందుకు యువతీ, యువకులు వైద్యుల సూచనలు, సలహాలు పాటించాలన్నారు. వ్యాధిగ్రస్తులపై వివక్షత చూపించొద్దని కోరారు. అనైతిక లైంగిక సంబంధాలు, బ్లడ్ ట్రాన్స్‌ఫర్, ఐవీ డ్రగ్స్, హోమో సెక్స్, కండోమ్స్ వాడకపోవడం వల్ల ఎయిడ్స్ బారిన పడి ప్రాణాలు కోల్పోవడంతో పాటు, కుటుంబం విచ్ఛిన్నం అవుతుందన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి విజయ్‌కుమార్, నోడల్ అధికారి రాజ్‌కుమార్ జాదవ్, డాక్టర్లు హనుమంతరావు, శివకుమార్, శ్రవణ్‌కుమార్, వైద్యసిబ్బంది, నిర్మలా స్కూల్ ప్రిన్సిపాల్ జిన్సీ, కరస్పాండెంట్ మెర్సీ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఈరునాయక్, శివ, రామకృష్ణ, పద్మ పాల్గొన్నారు.
హెచ్‌ఐవీ రహిత జిల్లాగా నిర్మిద్దాం
నెహ్రూసెంటర్: మహబూబాబాద్‌ను హెచ్‌ఐవీ రహిత జిల్లాగా నిర్మించేందుకు యవతరం కీలకంగా కృషి చేయాలని డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్ అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఐఎంఏ హాల్‌లో సోమవారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యాధిగ్రస్తులు పౌష్టికాహారం తీసుకోవాలని, మందులు క్రమం తప్పకుండా వేసుకోవాలని సూచించారు. వ్యాధిపై అవగాహన కల్పించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేయాలన్నారు. వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితంగా హెచ్‌ఐవీ టెస్టులు చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, జిల్లా ఆస్పత్రుల సమన్వయ కర్త చింత రమేశ్, పీఓ విజయ్‌కుమార్, డాక్టర్ లక్ష్మీనారాయణ, విజయ్, శ్రవణ్, డెమో ప్రసాద్, ప్రాజెక్టు సీఎస్‌ఓ సారయ్య, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.


