బ్యాలెట్ బాక్స్‌ల పరిశీలన
నెల్లికుదురు: మండల కేంద్రంలో భద్రపరిచిన స్థానిక సంస్థల ఎన్నికల బ్యాలెట్ బాక్స్‌లను రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు కె.మధుకర్ బాబు సోమవారం పరిశీలించారు. మండల ప్రత్యేక అధికారి జినుగు మరియన్న, తహసీల్దార్ చంద నరేష్, ఎంపీడీఓ సింగారపు కుమార్, ఎస్సై చిర్ర రమేష్ బాబుతో కలిసి ఆయన బ్యాలెట్ బాక్స్‌లను పరిశీలించారు.
అప్రమత్తంగా వ్యవహరించాలి
దంతాలపల్లి: నామినేషన్ల స్వీకరణ సమయంలో ఆర్వోలు అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు మధుకర్‌బాబు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం అభ్యర్థులు వేసిన నామినేషన్లను పరిశీలించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సునీల్‌కుమార్, ఎంపీడీఓ విజయ తదితరులు పాల్గొన్నారు.


