భగవద్గీతను అందరూ చదవాలి
హన్మకొండ కల్చరల్: శ్రీకృష్ణభగవానుడు ఉపదేశించిన భగవద్గీత అందరూ చదవాలని తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ కోరారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మప్రచార పరిషత్ వరంగల్ అధ్వర్యంలో సోమవారం హనుమకొండలోని టీటీ డీ కల్యాణమండపంలో గీతాజయంతి వేడుకలు ఘ నంగా నిర్వహించారు. ప్రోగ్రాం ఇన్‌చార్జ్ రామిరెడ్డి కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ము ఖ్యఅతిథిగా గంగు ఉపేంద్రశర్మ, అతిథులుగా ఆర్యవైశ్య సంఘం నాయకులు గట్టు మహేశ్‌బాబు, వికా స తరంగిణి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బచ్చు రాధాకృష్ణ హాజరై జ్యోతిప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా 6వ తగగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు భగవద్గీత శ్లోకాల కంఠస్థపోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. న్యాయనిర్ణేతలుగా తెన్నేటి వసుంధర, వలస పైడి, మచ్చమ్మ, దయాకర్‌స్వామి, వేదాంతం శ్రీదేవి, దుర్గ వ్యవహరించారు.


