రాష్ట్రస్థాయి రగ్బీ విజేత రంగారెడ్డి
డోర్నకల్ : మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌లోని స్థానిక చర్చి కాంపౌండ్ గ్రౌండ్‌లో మూడ్రోజుల పాటు నిర్వహించిన 69వ ఎస్‌జీఎఫ్ అండర్–17 బాలబాలికల రాష్ట్రస్థాయి రగ్బీ పోటీల్లో రంగారెడ్డి జట్లు విజేతగా నిలిచాయి. ఉమ్మడి పది జిల్లాల జట్లు పాల్గొన్న రగ్బీ పోటీల్లో చివరి రోజు సోమవారం ఫైనల్‌లో బాలుర విభాగంలో రంగారెడ్డి మొదటి స్థానంలో నల్లగొండ రెండో, మెదక్ మూడో స్థానంలో నిలిచాయి. అలాగే బాలికల విభాగంలో రంగారెడ్డి మొదటి, మహబూబ్‌నగర్ రెండో, మెదక్ మూడో స్థానానికి పరిమితమయ్యాయి. డోర్నకల్ డయోసీస్ బిషప్ డాక్టర్ కె.పద్మారావు విజేతలకు బహుమతులు ప్రదానం చేసి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మూడ్రోజుల పాటు టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించిన పీఈడీలు రవికుమార్, విజయచందర్‌ను బిషప్ అభినందించారు. కార్యక్రమంలో టోర్నమెంట్ పరిశీలకులు యూనూస్‌పాషా, శ్రీనివాసులు, సెయింట్ ఆగ్నేస్ పాఠశాల కరస్పాండెంట్ ఆంటోని పసాల, ఉపాధ్యాయ సంఘాల నాయకులు వెంపటి సీతారాములు, తలారి విద్యాసాగర్, పీఈడీలు తదితరులు పాల్గొన్నారు.
మొదటి స్థానంలో బాలబాలికల జట్లు


