బేరసారాలు..
సాక్షి, మహబూబాబాద్: మద్యం షాపుల కేటాయింపు కోసం జరిగిన లాటరీలో షాపు దక్కినవారు షాపు ఎలా నడపాలని ఆలోచిస్తుండగా.. షాపు దక్కని మద్యం వ్యాపారులు లాటరీలో షాపులు వచ్చిన వారికి గుడ్ విల్ ఇచ్చి షాపు తీసుకునేందుకు బేరసారాలు కుదుర్చుకునే పనిలో పడ్డారు. ఇందుకోసం డిమాండ్ ఉన్న షాపులకు రూ.కోట్లు ఇచ్చేందుకు సైతం సై అంటున్నట్లు వినికిడి. అయితే దరఖాస్తులు వేసేటప్పడు అయిన సిండికేటు దారుల్లో కొందరు షాపులుఅమ్మాలని, మరికొందరు అమ్మొద్దని చెప్పడంతో అయోమయం నెలకొంది.
సిండికేటుదారుల్లో కుదరని సయోధ్య
గత సీజన్‌లో మద్యం షాపుకోసం దరఖాస్తు ఫీజు రూ.2 లక్షలు ఉండగా.. ఈ సీజన్‌లో ఆ మొత్తాన్ని రూ.3 లక్షలకు పెంచారు. అయితే లాటరీలో షాపు రాకపోతే దరఖాస్తు ఫీజు ప్రభుత్వానికే చెందే పద్ధతి ఉండడంతో పెద్ద మద్యం వ్యాపారులు సింగిల్‌గానే దరఖాస్తులు చేసుకున్నారు. చిన్న చిన్న వ్యాపారులు, రియల్ ఎస్టేట్, ఇతర ఉద్యోగస్తులు తమ డబ్బులకు ఎంతో కొంత రక్షణ ఉంటుందని తాము తీసిన డీడీలతో సిండికేట్లుగా మారారు. ఇలా పది దరఖాస్తుల నుంచి మొదలైన సిండికేట్ వంద దరఖాస్తుల వరకు కూడా ఉన్నాయి. అయితే ఈ సిండికేటులో ఒకటి, రెండుషాపుల వచ్చినవారు ఉన్నారు. అసలే రానివారు కూడా ఉన్నారు. దీంతో ఎక్కువ మంది సిండికేట్‌గా ఉన్న గ్రూప్‌లో ఒకటి, రెండు షాపులు వస్తే వాటి నిర్వహణపై తర్జన భర్జన పడుతున్నారు. కొందరు షాపును అమ్మి డబ్బులు పంచుకుందాని చెబుతుండగా మరికొందరు షాపును నడిపిద్దామని అంటున్నారు. ఇలా ఇరువర్గాల మధ్య సమోధ్య కుదరడంలేదని వ్యాపారులు చెబుతున్నారు.
గుడ్ విల్ రూపంలో రూ.కోట్లు!
జిల్లా వ్యాప్తంగా 61 మద్యం షాపులకు 1,800 దరఖాస్తులు వేశారు. అయితే లాటరీలో షాపులు దక్క ని వారు షాపులు కొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించగా.. షాపులు దక్కిన వారిలో కొందరు షాపులు నడిపించలేక పార్ట్‌నర్‌ను కలుపుకోవడం.. లేదా గుడ్ విల్ తీసుకొని షాపులు వేరేవారికి అప్పగించే ఆలోచనలో ఉన్నారు. ఇలా జిల్లాలోని ఎక్కువ బెల్ట్ షాపులు ఉన్న ప్రాంతం, ఎక్కువ మద్యం అమ్మకాలు జరిగే ప్రాంతాల్లోని షాపులకు పెద్ద మొత్తంలో గుడ్ విల్ ఇచ్చి షాపులు తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని మహబూబాబాద్ సర్కిల్‌లో ఒక షాపును రూ.కోటి కి పైగా గుడ్‌విల్ ఇచ్చి లాటరీలో షాపు దక్కిన వారి నుంచి ఓ మద్యం వ్యాపారి తీసుకున్నట్లు ప్రచారం. అదే విధంగా మహబూబాబాద్, తొర్రూరు, గూడూ రు ఎక్సైజ్ సర్కిళ్లలో షాపులు తీసుకునేందుకు మ ద్యం వ్యాపారులు పోటీ పడుతున్నారు. అదే విధంగా సిండికేట్‌లో ఉన్న సభ్యులు కొందరు షాపును నడిపించుకునేందుకు షాపునకు బేరం పెట్టి మిగిలి న సభ్యులకు డబ్బులు ఇచ్చే విధంగా అంగీకారం చేసుకుంటున్నారు. పోటీ ఎక్కువగా ఉన్న షాపులకు వేలం వేసిమరీ షాపులు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇలా షాపునకు రూ.70 లక్షల నుంచి రూ.1.5 కోట్ల వరకు కొనుగోలు చేసి చేతులు మారుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.
లాటరీలో వచ్చినవారే బాధ్యులు..
ఒక వైపు లాటరీలో షాపులు దక్కిన వారు భేరసారాలకు దిగి మరొకరికి షాపు అప్పగించే పనిలో ఉన్నారు. మరో వైపు ఎకై ్సజ్ అధికారులు మాత్రం లాటరీలో షాపు దక్కిన వారే రెండు సంవత్సరాలు షాపు నిర్వహించేందుకు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మద్యం అమ్మకాలు, రెంటల్ చెల్లింపులు మొదలైన విషయాలపై ముందుగానే అగ్రిమెంట్ పత్రం రాసి ఇవ్వాల్సి ఉంటుంది. షాపులపై కేసులు అయినా.. ఇతర సమస్యలు వచ్చినా.. లాటరీలో షాపు వచ్చిన వారే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. దీంతో లాటరీలో షాపు దక్కించుకున్న వారు నమ్మకస్తులకే షాపును ఇవ్వడం.. లేదా.. ముందుగానే అడ్వాన్స్ డబ్బులు తీసుకొని షాపు అప్పగించడంపై ఆచీ తూచీగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.
లక్కీ డ్రాలో వైన్స్ వచ్చిన వారికి డిమాండ్
రూ.కోట్లు పలుకుతున్న వైనం
సిండికేటుదారుల్లో కుదరని సయోధ్య
షాపుల కొనుగోలుపై మద్యం వ్యాపారుల కన్ను


