మధ్యవర్తిత్వాన్ని వినియోగించుకోవాలి
మహబూబాబాద్ రూరల్ : కుటుంబం, సమాజంలో తలెత్తే వివాదాలను సామాజిక మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ పిలుపునిచ్చారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మా నుకోటలో సకల జన కమ్యూనిటీ మీడియేషన్ కేంద్రం ఏర్పాటు చేయగా.. శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా ధికార సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన కమ్యూనిటీ సామాజిక మధ్యవర్తులచే సకల జన కమ్యూని టీ మీడియేషన్ కేంద్రం నిర్వహించనున్నట్లు తెలి పారు. ఈ కేంద్రంలోని సేవలు అన్ని పూర్తిగా ఉచితమేనని చెప్పారు. నేటి సంక్లిష్ట సమాజంలో భార్యాభర్తల మధ్య చిన్నపాటి తగవుకే ఎన్నో కేసులు దాఖలవుతున్నాయని, దానివల్ల బంధాలు దెబ్బ తింటున్నాయన్నారు. సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ శాలిని షాకెల్లి మాట్లాడుతూ.. కమ్యూనిటీ వివాదాలను పరిష్కరించడంలో శిక్షణ పొందిన వలంటీర్లు చురుకై న పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేశ్వరరావు, శిక్షణ పొందిన మీడియేటర్లు శంతన్ రామరాజు, పిట్టల బుచ్చిరామారావు, సుతారపు వెంకటనారాయణ, ఎడ్ల శ్రీనివాస్, వాంకుడోత్ భద్రమ్మ పాల్గొన్నారు.
15న ప్రత్యేక లోక్ అదాలత్
తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి ఈ నెల 15న జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మహమ్మద్ అబ్దుల్ రఫీ తెలిపారు. జిల్లా పరిధిలోని పోలీసు అధికారులు, కోర్టు డ్యూటీ ఆఫీసర్లతో జిల్లా కోర్టు ఆవరణలో శనివారం సమావేశం నిర్వహించారు. పూర్తి వివరాలకు ఆయా కోర్టుల్లోని న్యాయ సేవాధికార సంస్థలను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ శాలిని షాకెల్లి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి స్వాతి మురారి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి అరవపల్లి కృష్ణతేజ్, డీఎస్పీ తిరుపతిరావు, పీపీ గణేష్ ఆనంద్, జిల్లా కోర్టు పరిపాలనాధికారి క్రాంతికుమార్ పాల్గొన్నారు.
జిల్లా జడ్జి మహమ్మద్ అబ్దుల్ రఫీ
సకలజన కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ ప్రారంభం


