విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పెంచాలి
● కలెక్టర్ అద్వైత్ కుమార్‌సింగ్
మహబూబాబాద్ అర్బన్/ మహబూబాబాద్: విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంచాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఉపాధ్యాయులకు సూ చించారు. జిల్లా కేంద్రంలోని కేజీవీబీ, శనిగపురం పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాన్ని శనివారం ఆయన తనిఖీ చేసి, మాట్లాడారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో బోధించాలన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజె న్స్, డిజిటల్ తరగతులతో ప్రతి సబ్జెక్ట్‌పై పట్టు సా ధించేందుకు, విద్యార్థి సామర్థ్యాలను వెలికితీసేందుకు ప్రభుత్వం సదుపాయాలు కల్పిస్తుందన్నారు. మెనూ పాటిస్టూ నాణ్యమైన ఆహార పదార్థాలను వంటలకు ఉపయోగించాలని చెప్పారు. షెడ్యూల్ ప్రకారం విద్యార్థులకు వైద్యపరీక్షలు చేయించాలని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నపిల్లలు, గ ర్భిణులు, బాలింతలకు బలవర్ధమైన ఆహారం అందించాలని, హెల్త్ ప్రొఫైల్‌ను మెయింటైన్ చేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాజేశ్వర్‌రావు, కేజీబీవీ ఎస్‌ఓ భవాని, ఉపాధ్యాయులు ఉన్నారు.
సొంతింటి కల సహకారానికి కృషి
మహబూబాబాద్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో సొంతింటి కల సాకారం చేసేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై కలెక్టరేట్‌లో శనివారం కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తుపాను ప్రభావంతో కలిగిన నష్టాన్ని అంచనా వేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


