
ఉమ్మడి కుటుంబమే భేష్..
బంధాలు తెగి.. అనుబంధాలు వీడి
● యాంత్రిక జీవనంలో కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం
● చిన్నచిన్న సమస్యలకే విడాకుల వరకు..
● కొరవడిన పెద్దల మార్గనిర్దేశం
నేడు ప్రపంచ జనాభా దినోత్సవం
ఒకే ఇల్లు.. ఒకే వంట
డోర్నకల్: డోర్నకల్‌లో దశాబ్దాలుగా జైనమతానికి చెందిన పలువురు ఉమ్మ డి కుటుంబానికే ప్రాధాన్యత ఇస్తున్నా రు. కాగా పట్టణంలోని మెయిన్ రోడ్డు కు చెందిన కాలా సుమేర్‌చంద్‌జైన్‌ది ఉమ్మడి కుటుంబం. సుమేర్‌చంద్, మ నోజ్‌కుమార్, ఆనంద్‌కుమార్, సుశీల్‌కుమార్ నలుగురు అన్నదమ్ములు. వారి భార్యాపిల్లలతో కలిసి ఒకే ఇంట్లో ఉంటూ ఆనందంగా గడుపుతున్నారు. కుటుంబంలో మొత్తం 19మంది ఉన్నారు. వారికి వంటతో పాటు ఇతర పనులన్నీ ఇంట్లో మహిళలు కలిసి చేస్తుండగా.. అన్నదమ్ములంతా ఉమ్మడిగా వ్యాపారం చేస్తున్నారు. ప్రతీ రోజూ కలిసి పనులు చేసుకోవడం, కలిసి భోజనం చేస్తూ ఆనందంగా గడుపుతున్నామని సుమేర్‌చంద్‌జైన్ చెబుతుండగా.. ఎలాంటి సమస్య వచ్చినా అందరం కలిసి పరిష్కరించుకుంటున్నామని, కలిసి ఉండడంతోనే ఆరోగ్యంగా, ధైర్యంగా ఉంటున్నామని మహిళలు అంటున్నారు.