
అఽధికారుల తప్పిదం.. రైతుకు శాపం
హసన్‌పర్తి: అధికారుల తప్పిదం.. రైతుకు శాపంగా మారింది. జాతీయ రహదారి 563లో నిర్మాణంలో భాగంగా అధికారులు చేపట్టిన సర్వే సందర్భంగా అనేక పొరపాట్లు చోటు చేసుకున్నాయి. క్షేత్రస్థాయికి వెళ్లకుండా కేవలం గూగుల్ మ్యాప్ ఆధారంగా సర్వే నంబర్లు సేకరించి నివేదిక ఇచ్చినట్లు రైతుల నుంచి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి, సూరారం, కోతులనడుమ, వల్భాపూర్, పెంబర్తి గ్రామాల్లో రైతులు భూములు కోల్పోతున్నట్లు నివేదికల్లో పేర్కొనలేదు. హసన్‌పర్తి మండల కేంద్రానికి చెందిన గొర్రె సారయ్యకు గ్రామ శివారులోని సర్వే నంబర్ 63/ఏలో సుమారు 0.32 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని రోడ్డు నిర్మాణంలో కోల్పోతున్నాడు. అయితే సర్వే అఽధికారులు ఈ నంబర్లును పరిహార జాబితాలో పొందపరచలేదు. దీంతో సదరు రైతు ఆందోళనకు గురై పరిహారం రాకపోవడంతో చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆ భూమి సేకరణకు నోటిఫికేషన్..
సర్వే సందర్భంగా తప్పిపోయిన ఆ భూములను సేకరిస్తున్నట్లు జనవరి 14న నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్‌లో ఆయా ప్రాంతాల వారీగా పరిహారం నిర్ణయించారు. హసన్‌పర్తిలో ఎకరానికి రూ.1.06 కోట్లుగా మార్కెట్ ధర నిర్ణయించారు. అయితే ఈ రోడ్డు భూసేకరణ చేపట్టిన సమయంలో 2017లో జారీ చేసిన నోటిఫికేషన్‌లో మార్కెట్ ధర రూ.51లక్షలు. దీంతో మార్కెట్ ధర రెట్టింపు కావడంతో పరిహారం చె ల్లించడానికి అధికారులు జాప్యంచేస్తూ వస్తున్నారని బాధిత రైతు కుటుంబ సభ్యులు తెలిపారు.
అధికారులు స్పందించడం లేదు..
పరిహారం చెల్లింపులో అధికారుల స్పందించడం లేదు. సరైనా సమాచారం కూడా అందించడం లేదు. దీంతో రోజూ కార్యాలయం చుట్టు ప్రదక్షణ చేస్తున్నా. –గొర్రె కిరణ్, మృతుడి కుమారుడు
పరిహారం చెల్లింపులో జాప్యం
రోదిస్తున్న నేషనల్ హైవే బాధితుడు