● 18 ఏళ్లు నిండి ప్రతి ఒక్కరూ ఈసీఐ గవర్నమెంట్ ఇన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ ఫోన్ నంబర్, ఈ–మొయిల్ ఐడీతో సైన్ అప్ కావాలి.
● క్రియేట్ చేసిన అకౌంట్‌పై క్లిక్ చేసి తన పేరు, పాస్‌వర్డ్ నమోదు చేయాలి. తర్వాత పాస్‌వర్డ్ నిర్ధారించాలి.
● సైన్ అప్ అయిన ఈ–మొయిల్ ఐడీకి ఓటీపీ వస్తుంది. దానిని ఎంట్రీ చేసి అందులో ఓటరు వివరాలు నమోదు చేసుకోవాలి. తర్వాత మొబైల్ నంబర్, పాస్‌వర్డ్ నమోదు చేసి ఓటీపీతో లాగిన్ అవ్వాలి.
● కొత్తగా ఓటరు నమోదు చేసుకునే వారు ఫామ్–6తో వ్యక్తిగత వివరాలు, అడ్రస్ తదితర వివరాలు నమోదు చేసి అందులో పేర్కొన్న ధ్రువపత్రాలను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి. అనంతరం మరోసారి వివరాలను సరిచూసుకుని సబ్మిట్ చేయాలి.
● మార్పులు, చేర్పుల కోసం ఫామ్–8, ఓటరు పేరు తొలగించుకునేందుకు ఫామ్–7 నింపాలి.
● ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ పై క్లిక్ చేస్తే దరఖాస్తు చేసిన సమయంలో ఎస్‌ఎంఎస్ వచ్చిన రెఫరెన్స్ నంబర్‌ను నమోదు చేసి సబ్మిట్ చేస్తే అప్లికేషన్ స్టేటస్ ఎంతవరకు వచ్చిందో తెలుస్తుంది.