
కేంద్రం మొండి వైఖరి వీడాలి
హన్మకొండ: విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర కోచైర్మన్ ఇనుగాల శ్రీధర్ డిమాండ్ చేశారు. దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా బుధవారం విద్యుత్ అధికారులు, ఉద్యోగులు విధులు బహిష్కరించి టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా 50 లక్షల మంది విద్యుత్ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారన్నారు. విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించాలనే ఆలోచనను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో దేశ వ్యాప్తంగా సమ్మె చేస్తామని హెచ్చరించారు. పేద, మద్య తరగతి ప్రజలున్న దేశంలో విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించడం సరికాదన్నారు. ఇప్పటికే విద్యుత్ చార్జీలు అధికంగా ఉన్నాయని, ప్రైవేటీకరిస్తే చార్జీలు మరింత పెరిగే ప్రమాదముందన్నారు. దీనిని వినియోగదారులు, రైతులు భరించలేరన్నారు. ఇప్పటికై నా కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని వీడాలన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు వేమునూరి వెంకటేశ్వర్లు, బి.సామ్యా నాయక్, ఎన్.సుబ్రహ్మణ్యేశ్వర్ రావు, పి.మల్లికార్జున్, పి.మహేందర్ రెడ్డి, కె.రంగా రావు, ఎ.ఆనందం, ఎన్.కుమారస్వామి, అజ్మీరా శ్రీరాం నాయక్, వాలు నాయక్, బి.ఆంజనేయులు, ఆర్.నవీన్, జె.అరుణ్, ఎల్.శ్రీనివాస్, జె.హర్జీ నాయక్, మచ్చిక బుచ్చయ్య గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర కోచైర్మన్ శ్రీధర్