తొర్రూరు/ కొడకండ్ల: వై ద్యం వికటించడంతోనే వృద్ధుడు మృతి చెందా డని ఆరోపిస్తూ బంధువులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటన డివిజన్ కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆ స్పత్రిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. జనగామ జి ల్లా కొడకండ్ల మండల కేంద్రానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు పొన్నం పాండురంగయ్య(70) గ్రామాల్లో దుస్తుల విక్రయాలు జరుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. రోజు వారి మాదిరిగానే బుధవారం కూడా గ్రామాలు తిరిగి ఇంటికి చేరుకున్న సమయంలో తీవ్ర కడుపు నొప్పికి గురయ్యాడు. ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లగా తొర్రూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని సూచించాడు. దీంతో తొర్రూరులోని పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకురాగా వైద్యుడు పరీక్షించి ఇంజక్షన్లు, ఇతర వై ద్యం చేశాడు. అయినా నొప్పి తగ్గకపోవడంతో స్కానింగ్ తీసుకురావాలని సూచించాడు. దీంతో పట్టణంలోని ఓ స్కానింగ్ సెంటర్‌కు తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందగా వృద్ధుడి మృతదేహంతో బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందో ళన చేపట్టారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆందోళనకారులు శాంతించలేదు. చివరకు ఆస్పత్రి తరఫున పరిహారం అందేలా కృషి చేస్తామని మ ద్యవర్తులు తెలపడంతో మృతదేహాన్ని తీసుకెళ్లారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఘటనపై ఎస్సై ఉపేందర్ వివరణ కోరగా ఫిర్యాదు అందలేదని తెలిపారు.
● ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన
● తొర్రూరులో ఘటన