
జయ్యారం బడి భేష్..
చిన్నగూడూరు: మండలంలోని జయ్యారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించారు. ప్రస్తుతం ఆరుగురు విద్యార్థులు ఆదిలాబాద్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించి, పాఠశాలకు మంచి పేరు తీసుకొచ్చారు. ప్రధానోపాధ్యాయురాలు ఉషశ్రీ, ఉపాధ్యాయుల సలహాలు, సూచనలు పాటించడం వల్ల పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించామని, అదే స్ఫూర్తితో ట్రిపుల్ ఐటీలో సీటు సాధించామని ఎంపికై న విద్యార్థులు తెలిపారు. కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకోవడమే తమ లక్ష్యమని అన్నారు.
మండలం నుంచి ఏడుగురు ఎంపిక..
ఇటీవల విడుదలైన ట్రిపుల్ ఐటీ ఎంపిక జాబితాలో మండలం నుంచి ఏడుగురు విద్యార్థులు ఎంపిక కాగా, ఒక జయ్యారం జెడ్పీహెచ్‌ఎస్ నుంచే ఆరుగురు సెలెక్ట్ అయ్యారు. పది ఫలితాల్లో వందశాతం ఫలితాలు సాధించడమే కాకుండా, 36 మంది విద్యార్థులు 500పైగా మార్కులు సాధించారు. ప్రస్తుతం ట్రిపుల్ ఐటీలో ఆరుగురు సీట్లు సాధించడంతో గ్రామస్తులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పదో తరగతిలో ఉత్తమ ఫలితాల సాధన
ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించిన ఆరుగులు విద్యార్థులు