
ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ నియోజవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ఎంపీ పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పొద్దున లేస్తే బీఆర్‌ఎస్ వాళ్లకు ముఖ్యమంత్రిని విమర్శించడమే తప్ప వేరే ఏం పనిలేదని మండిపడ్డారు. సోమ్లాతండా, కేసముద్రంలో ఉప ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటనను విజయవంతం చేసినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మహబూబాబాద్ నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను మంత్రులకు వివరించామని, త్వరలో వాటిని కూడా మంజూరు చేపిస్తామని అన్నారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇస్తున్నామని, ఇటీవలే రెండు డీఏలు ఇచ్చామని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి సహకారంతో రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా మార్చేందుకు కృషి చేస్తామని తెలిపా రు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు భరత్‌చందర్ రెడ్డి, మండల అధ్యక్షులు రాంరెడ్డి, నాగేశ్వరరావు, ప్రభా కర్, చిట్టెం వెంకన్న, సతీష్, నాయకుల వెంకన్న, సురేందర్, యాదవరెడ్డి, మహేందర్ రెడ్డి, రాజు, హరిసింగ్, రమేశ్, ప్రవీణ్ కుమార్ ఉన్నారు.