
సమగ్రశిక్ష జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్‌గా మన్మోహన్
విద్యారణ్యపురి: సమగ్రశిక్షలో (విద్యాశాఖ) హనుమకొండ జిలా క్వాలిటీ ఎడ్యుకేషన్, స్కూల్ వెలుపల ఉన్న పిల్లల విభాగాలకు కోఆర్డినేటర్‌గా డాక్టర్ బండారు మన్మోహన్‌ను నియమిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం డీఈఓ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. మన్మోహన్ ఎడ్యుకేషన్‌లో గౌరవ డాక్టరేట్, జువాలజీలో డాక్టరేట్ పొందారు. 25 సంవత్సరాల ఉపాధ్యాయ అనుభవం కలిగిన ఆయన రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి రిసోర్స్‌పర్సన్‌గా పనిచేశారు.
దరఖాస్తుకు నేడు చివరి తేదీ
న్యూశాయంపేట : సీఎస్‌ఏటీ 2025–26 ఉచిత శిక్షణ కోసం సోమవారంతో దరఖాస్తు గడువు ముగుస్తుందని ఎస్సీ స్టడీ సర్కిల్ ఉమ్మడి జిల్లా సంచాలకుడు కె.జగన్మోహన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సివిల్స్‌కు సన్నద్ధమయ్యే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కేటగిరీ అభ్యర్థులు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిక్షణ పొందేందుకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారన్నా రు. ఈ పరీక్ష ఈనెల 13న సుబేదారి ఆర్ట్స్ కళాశాలలో నిర్వహిస్తామని తెలిపారు. వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.