
వీరన్న సన్నిధిలో తొలి ఏకాదశి సందడి..
కురవి: కురవిలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మున్నేరు నది నుంచి నూతన జలాలను అర్చకులు, వేదపండితులు తీసుకొచ్చి ఆలయంలో ప్రదక్షిణలు చేశారు. వీరభద్రస్వామికి మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొర్ను రవీందర్‌రెడ్డి, ఆలయ అర్చకులు, వేదపండితులు రెడ్యాల శ్రీనివాస్, పెనుగొండ అనిల్, దూసకంటి విజయ్, విజయ్, తేజ, పుణ్యమూర్తి, రమేశ్, అభిలాష్, శ్రీకాంత్, బాలకృష్ణ, ధర్మకర్తలు బాలగాని శ్రీనివాస్ గౌడ్, చిన్నం గణే్‌శ్ జనార్దన్‌రెడ్డి, సక్రునాయక్, సోమ్లా, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నేటి ప్రజావాణి రద్దు
మహబూబాబాద్ అర్బన్: కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరగనున్న ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ ఆదివారం తెలిపారు. ఈ నెల 8న మహబూబాబాద్, కేసముద్రం మండలాల్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఉన్నందున జిల్లా స్థాయి అధికారులు ఆపనుల్లో నిమగ్నమై ఉన్నందున ప్రజావాణి రద్దు చేసినట్లు చెప్పారు.
రిలే నిరాహార దీక్షలో చిన్నారులు..
కేసముద్రం: ఎంజాయ్‌మెంట్ సర్వే ప్రకారం తమకు పట్టా పాసుబుక్కులు అందించాలని ఆదివారం మండలంలోని నారాయణపురం గ్రామంలో బాధిత రైతులు తమ పిల్లలతో కలిసి రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆ గ్రామ మాజీ ఎంపీటీసీ దారావత్ రవి, పలువురు రైతులు మాట్లాడారు. సాగు చేసుకుంటున్న తమ భూములకు పట్టాదారు పాసుబుక్కులు రాకపోవడంతో ఏడు సంవత్సరాలుగా ప్రభుత్వ పథకాలను కోల్పోతున్నామన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఎంజాయ్‌మెంట్ సర్వే ప్రకారం పట్టాదారు పాసుబుక్కులు ఇప్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
పనిగంటల పెంపు
ఉత్తర్వులు రద్దు చేయాలి
నెహ్రూసెంటర్: రాష్ట్రంలో పని గంటల పరిమితిని 8నుంచి 10 గంటలకు పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులు వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికుల శ్రమ దోపిడీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పని గంటలను పెంచుతుందని ఆరోపించారు. కార్మిక వ్యతిరేక లేబర్‌కోడ్‌లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పని గంటల పెంపును ఉపసంహరించుకోవాలని అన్నారు. సమావేశంలో నాగన్న, రాజమౌళి, రాజు, వీరన్న, మల్లయ్య, శ్రీశైలం, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన చెస్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ పబ్లిక్‌గార్డెన్ వద్ద ఉన్న టీటీడీ కల్యాణ మండపంలో రెండు రోజులపాటు నిర్వహించిన ఓపెన్ టు ఆల్ చెస్ పోటీలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. వరంగల్ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో హోరాహోరీగా సాగిన పోటీల్లో గండు రిత్విక్, దారా సాయివివేష్, జె.రంజిత్, నిక్రీ ప్రహర్ణ విజేతలుగా నిలిచినట్లు నిర్వహణ కార్యదర్శి పి.కన్నా తెలిపారు. ముగింపు వేడుకల్లో ఆర్బిటర్లు సీహెచ్ శ్రీనివాస్, రజినీకాంత్, ఫ్రాంక్లిన్, అక్షయ్ తల్లిదండ్రులు, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు.

వీరన్న సన్నిధిలో తొలి ఏకాదశి సందడి..

వీరన్న సన్నిధిలో తొలి ఏకాదశి సందడి..

వీరన్న సన్నిధిలో తొలి ఏకాదశి సందడి..