
పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
గూడూరు: ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మానుకోట ఎమ్మెల్యే మురళీనాయక్ అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం పార్టీ మండల అధ్యక్షుడు చిట్టె వెంకన్న అధ్యక్షతన మండల, గ్రామ స్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ నెల 8న కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో సుమారు రూ.300 కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, మరో ఆరుగురు మంత్రులు హాజరవుతారన్నారు. ఆ సందర్భంగా అక్క డ నిర్వహించే బహిరంగ సభకు గూడూరు మండలం నుంచి సుమారు 5నుంచి 6వేల మంది కార్యకర్తలను తరలించి, సభను విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో నెక్కొండ వ్యవసాయ కమిటీ వైస్ చైర్మన్ ఎడ్ల నరేష్‌రెడ్డి, జిల్లా నాయకులు మాధవపెద్ది రమే్‌శ్‌చందర్‌రెడ్డి, ప్రదీప్‌రెడ్డి, బీరం శ్రీపాల్‌రెడ్డి, వాంకుడోతు కొమ్మాలు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ వేం శ్రీనివాస్‌రెడ్డి, ఎండి. యాకూపాషా, మండల మల్లేశ్, పెసరి శివ, కన్నబోయిన వెంకన్న, హెచ్ శివ,అర్రెం వీరస్వామి, చంటి స్వామి పాల్గొన్నారు. అదేవిధంగా పీఏసీఎస్ చైర్మన్ చల్ల లింగారెరడ్డి, మాజీ ఎంపీపీ నూనావత్ రమేశ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కత్తి స్వామి కేసముద్రంలో జరిగే కాంగ్రెస్ సభ విజయవంతానికి కృషి చేయాలి మండల నాయకులకు పిలుపునిచ్చారు.
బహిరంగ సభను విజయవంతం చేయాలి
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మండలంలోని సోమ్లాతండాలో ఈ నెల 8న జరగనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే మురళీనాయక్ అన్నారు. సోమ్లాతండాలో బహిరంగ సభ, హెలిపాడ్ స్థలాన్ని ఎమ్మెల్యే మురళీనాయక్, డీసీసీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు మంగళవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వర్‌రావు, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి హాజరవుతారని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చని, అప్రమత్తంగా ఉండాలని, మానుకోట నియోజకవర్గంలో 90 శాతానికిపైగా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందే విధంగా సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే మురళీనాయక్