
సంస్థ అభివృద్ధికి పాటుపడాలి
● ఎన్పీడీసీఎల్ హనుమకొండ ఎస్‌ఈ పి.మధుసూదన్ రావు
హన్మకొండ : సంస్థ అభివృద్ధికి ఉద్యోగ సంఘాలు పాటుపడాలని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ పి.మధుసూదన్ రావు తెలిపారు. శనివారం నక్కలగుట్టలోని హనుమకొండ సర్కిల్ కార్యాలయంలో ఎస్‌ఈ మధుసూదన్ రావుకు తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ యూనియన్ హనుమకొండ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.శశికుమార్ పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ మాట్లాడుతూ ఉద్యోగులను అంకితభావంతో పని చేయించడంలో సంఘాలు తమ పాత్రను పోషించాలన్నారు. కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ధరావత్ లక్ష్మణ్ నాయక్, కార్యదర్శి కడెం మహేష్, సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ సాంబరాజు శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్లు గొలుసు ఉపేందర్, సంపత్ కుమార్, ఉపాధ్యక్షులు, అదనపు కార్యదర్శులు, సెక్రెటరీలు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు, కోశాధికారి పాల్గొన్నారు.